కష్టకాలంలో ములుగు జిల్లా ప్రజలకు ఆండగా కాంగ్రేస్ పార్టీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని ములుగు ఏమ్మేల్యే సీతక్క అన్నారు. సోమవారం తాడ్వాయి మండలంలోని కోండపర్తి ఆదివాసీ గోత్తికోయ గూడెంలోని 12 మంది నిరుపేద కుటుంబాల వారికి, జటగలంచ ఆదివాసీ గోత్తికోయ గూడెంలోని 37 నిరుపేదల కుంటుంబాలకు ఒక్కోక్క కుటుంబానికి 15 కేజీల బియ్యం,పప్పు,నూనే,కూరగాయలను గోదావరిఖని,పరకాల,వరంగల్‌కు చెందిన దాతల సహయ సహయసహకారాలతో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేదని,నివారణ ఒక్కటే మార్గమని అన్నారు.
ఈ సందర్బంగా సీతక్కతో లాక్డౌన్ విషయాలను అదివాసీలకు వివరించడం కోసం వచ్చిన మల్లన్నకు ఆదివాసీల జీవన విధానాన్ని గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జల్లా కాంగ్రేస్ పార్టీ అద్యక్షులు నల్లేల కుమారస్వామి, టిపిసీసీ కార్యదర్శి పైడాకుల ఆశోక్, ములుగు మండల అద్యక్షులు చాంద్ పాషా, సర్పంచ్ ఇర్ప సునీల్, తిరుపతిరెడ్డి, బోక్క సత్తిరెడ్డి, మర్రి రాజు, లచ్చుపటేల్, ఆకుతోట చంద్రమౌళి, నాయిని భరత్ తదితరులు పాల్గోన్నారు.
ములుగు క్యాంపు కార్యాలయంలో …
లాక్డౌన్ సమయంలో ఏజేన్సీలోని నిరుపేదల ఆకలి తీర్చడం కోసం నా పిలుపు మేరకు సహకరిస్తున్న దాతల సహకారం మరులేనిదని ములుగు ఎమ్మేల్యే సీతక్క అన్నారు. సోమవారం ములుగు క్యాంపు కార్యాలయంలో పరకాల,వరంగల్ నియోజకవర్గంల నుండి సుమారు 150 మంది దాతలు 70 వేల విలువగల బియ్యం,కూరగాయలు,పప్పు,నూనే ప్యాకెట్స్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు నాయిని భరత్ అద్వర్యంలో సీతక్కకు అందించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రేస్ పార్టీ అద్యక్షులు నల్లేల కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు నాయిని భరత్, ములుగు మండల అద్యక్షులు ఎండి చాంద్ పాషా, ఎంపిటిసి తిరుపతిరెడ్డి, యూత్ మండల అద్యక్షులు బానోత్ రవిచందర్,పిఏసిఎస్ వైస్ చైర్మెన్ పాల్గోన్నారు.