పేదలకు కనీసం ఆరువేలు పంపిణీ చేయాలి
బాధితులకు సీతక్క పరామర్శ
చుంచుపల్లిలో నిత్యావసరాలు పంపిణీ
కొరోనా బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అందించారు. కొరోనాను ఆరోగ్య శ్రీ చేర్చండని మరోమారు సిఎం కెసిఆర్‌ను కోరారు. పేద ప్రజల ప్రాణాలను కాపాడండి ముఖ్య మంత్రి గారూ అని కోరారు. ఫాం హౌస్ నుండి ప్రజల మధ్యకు రావాలన్నారు. రావాలిమంగపేట మండలం చుంచుపల్లి గ్రామంలో కొరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందించిన సీతక్క మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన 72 మంది కొరోనా బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కొరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. పేద ప్రజలు అర్దాకలితో అలుమటిస్తుంటే ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ హాస్పటల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ హాస్పటల్‌కు పోతే లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ హాస్పటల్ లను నియంత్రించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలం అయ్యాడన్నారు. వెంటనే కొరోనా ను ఆరోగ్య శ్రీ పథకం చేర్చి పేద ప్రజల ప్రాణాలను కాపాడలని, లాక్ డౌన్ నేపధ్యంలో ప్రతి కుటుంబానికి 6వేల రూపాయలు అందించాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరీ యణయ్యా కొంకథి సాంబశివ రావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహా రావు, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్ధ బత్తుల జగదీష్, చేన్నురి బాలరాజుయూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మురుకుంట్ల నరేందర్,జీవ వైవిధ్య మండల ప్రధాన కార్యదర్శివేమ రవినిమ్మల రాంబాబు, తోట అశోక్,అకుతోట పవన్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ఇసర్ ఖాన్, కర్రేనరేందర్ బాబు, జంపన్న, బాలకృష్ణ,యూత్ కాంగ్రెస్ ఏటూరు నాగారం మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్దల నవీన్,మండల అధికార ప్రతినిధి గద్దల నవీన్,చింటు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలపై కలెక్టర్‌కు సీతక్క వినతిపత్రం
జిల్లా కలెక్టర్‌ని ములుగు ఎమ్మెల్యే సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగూడ ,గంగారాం మండలాల్లో గిరి వికాస్ బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారెస్ట్ అధికారులు బోర్లు వేసుకునేందుకు అడ్డు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. గిరిజన బాలికపై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని కటినంగా శిక్షించాలని కలెక్టర్ గౌతమ్‌కు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం అందించారు.డోర్నకల్ నియోజకవర్గం మర్రి పేడ మండలం తండా ధర్మారంకు చెందిన ఉష అనే గిరిజన బాలిక పై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని కటినంగా శిక్షించాలని కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బి ఈ.ఈ ,డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రామ చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు