Take a fresh look at your lifestyle.

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

నయీం దాదాపు 12 మంది ఐపిఎస్‌ అధికార్లకు సంబంధాలు వున్నాయని, అందులో నలుగురు చాలా సన్నిహితంగా మెలిగే వారని నయీం చనిపోయిన తర్వాత పత్రికలు రాసాయి. నయీంతో భోంచేస్తూ, మాట్లాడుతూ ఉన్న పోలీసు ఆఫీసర్ల ఫోటోలు కూడాపత్రికల్లోప్రచురితమైనాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాలో అప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికార్లకు నయీం నెలకు 25 వేలనుండి 90 వేల వరకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డబ్బులు పంపేవాడని చెబుతుంటారు. అందులో డి.ఎస్‌.‌పి. స్థాయి నుండి ఎస్‌.ఐ. ‌స్థాయివరకు ఉన్నారు.

‘ప్రజాతంత్ర’ 1999, 21 నవంబర్‌ ‌సంచిక
పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తం, ఆజాం అలీల హత్యల తర్వాత, నయీం తన గ్యాంగ్‌ను వృద్ధి చేసుకొని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసాడు. పోలీసులు నయీంకు ఒక పిస్టల్‌ ఇచ్చారని, ఒక టాటా సుమో జీపు ఏర్పాటు చేసారని, ఆయన స్వయంగా మూడు ఇటలీ పిస్టల్లు సంపాదించుకున్నాడని, నాగోల్‌లో ఒక డెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడని, పత్రికల్లో వార్తలు వచ్చాయి. జనం గుసగుసలు కూడా పెట్టుకున్నారు. 2003 అక్టోబర్‌లో పౌర హక్కుల సంఘం (అప్పటి) నగర ఉపాధ్యక్షుడు జి. లక్ష్మణ్‌న• ప్రెస్‌క్లబ్‌లో మీటింగ్‌ ‌జరుగుతుండగా, బయటకు పిలిపించి కిడ్నాప్‌ ‌చేసి రెండు రోజులు పెట్టుకొని, హక్కుల సంఘంలో పని చెయ్యొద్దని, తనగురించి వాకబు చేయడం మానమని బెదిరించి, చిత్రహింసలు పెట్టి తలవెంట్రుకలు తొలగించి వదిలిపెట్టాడు. అందరూ చాలా ఆందోళన చెందారు. బాలగోపాల్‌, ‌కన్నభిరన్‌ ‌ముఖ్యమంత్రిని కూడా కలిసి లక్ష్మణ్‌ను విడిపించే ప్రయత్నాలు చేయమని పిటీషన్‌ ఇచ్చారు.

నయీమ్‌ ‌స్వయంగా హక్కుల కార్యకర్తలకు, ప్రజా సంఘాలలో పనిచేస్తున్న వారికి ఫోన్‌ ‌చేసి బెదిరించడం ఒక పనిగా మొదలు పెట్టాడు. ఒకరకమైన భీతావహ వాతావరణాన్ని సృష్టించాడు. ఆజం అలీ హత్య తర్వాత విప్లవ రచయితవరవర రావు గారితో సహా ఇంకా కొన్ని పేర్లు తన జాబితాలో ఉన్నాయని విలేకర్లతో పత్రికల్లో రాయించాడు. ఇటువంటి వార్తలు రావడంతో ‘‘నయీం చంపవలసిన వారి జాబితాలో ఉన్న పేర్లు బయటకు పొక్కి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేలా చేయడం ఎందుకు, ఆ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి’’ అని హైదరాబాద్‌ ‌నుంచి ఉన్నతాధికార్లునల్లగొండ ఎస్‌.‌పి.కి సూచన చేసినట్టు ‘‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’’ పత్రిక రాసింది.
1998లో నయీం చంపిన ఈదన్న దగ్గరి నుండి 2014లో పీపుల్స్‌వార్‌ ‌నుండి బయటకు వచ్చి టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఏకంగా పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవతారమెత్తిన కోనపురి ఐలయ్య, ఆయన తమ్ముడు కోనపురి రాములు వరకు దాదాపు రెండు డజన్ల హత్యలు చేసినట్టుగా పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌.‌లో పేర్కొన్నారు.

నిజానికి ఇంకా జరిగిన చాలా హత్యలు మామూలుగా పోలీస్‌ ‌స్టేషన్లలో కూడా నమోదు కాలేదు. రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్‌, ఈనాడు ఫిలింసిటీ చుట్టూ ప్రక్కలవై.ఎస్‌. ‌ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం బాగా సాగింది. 2005 నుండి 2007వ సంవత్సరం వరకు నయీం ఆచూకీ కనుక్కోవడానికి పీపుల్స్‌వార్‌ ‌పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులు నయీం కదలికలు చెప్పడానికి భయపడుతున్నారని, ఆ ప్రాంతంలో కమీషన్‌ ‌మీద పని చేస్తూ, ప్లాట్లు కొనడానికి వచ్చేవారికి ప్రాంతాన్ని సందర్శనకు తీసుకెళ్ళే వారి ద్వారా నయీం కదలికలు తెలుసు కోవడానికి పీపుల్స్‌వార్‌ ‌ప్రయత్నాలు చేస్తున్నట్టు పత్రికలు రాసాయి. ఈ రెండు సంవత్సరాలలో ఈ ప్రాంతంలో 8 మంది గుర్తు తెలియని యువకుల శవాలు లభించాయి. వాటిపై ఏ విచారణ పోలీసులుచేపట్ట లేదు. అవన్నీ కూడానయీం గ్యాంగ్‌ ‌చేసిన హత్యలే అనే వార్తలు వచ్చాయి. నయీం గ్యాంగ్‌ ‌హత్య చేసే విధానం కూడా చాలా భయంకరంగా ఉండేది. హక్కుల సంఘానికి చెందిన పురుషోత్తంను, నడిరోడ్డుమీద అందరు చూస్తుండగా కత్తితో నరికారు.

ఆజాం అలీని కూడా అదే తరహాలో చంపారు. విప్లవ దేశభక్త పులులు (ఆర్‌.‌టి.డి) వ్యవస్థాపక సభ్యుడు పటోళ్ళ గోవర్థన్‌ ‌రెడ్డి ఆటోలో వెళ్ళుతుండగా వెంబడించి బొగ్గులకుంట దగ్గర నయీం గ్యాంగ్‌కు చెందిన అయిదుగురు వ్యక్తులుకత్తులతో నరికి చంపారు. బెల్లి లలిత అనుచరులైన ఆలేరు మండలం, టంగుటూరుకు చెందిన ఇక్కిరి సైదులు, సంస్థాన్‌ ‌నారాయణపూర్‌కు చెందిన బద్దులమల్లేశ్‌ ‌యాదవ్‌, ‌మాదారంకు చెందిన శ్రీరాముల రాములును హైదరాబాద్‌లో 2001 జనవరి మాసంలో పట్టుకున్నారు. చౌటుప్పల్‌ ‌మండలం, మల్కాపురం సబ్‌స్టేషన్‌ ‌ప్రాంతానికి తీసుకెళ్ళి, కాళ్లు, చేతులు, మోండాలు వేరు చేసి ఒక్కొక్క శరీర భాగాన్ని దగ్గరి ప్రదేశంలో ఒక్కొక్క చోట పాతి పెట్టారు. ఓ పశువులకాపరికి బయటకు వచ్చిన చేయి కనిపించడంతో తవ్వి చూస్తే 6 కాళ్లు, 6 చేతులు బయటపడ్డాయి. మరొక చోట తవ్వగా మొండెం, తలభాగాలు దొరికాయి. మహబూబ్‌నగర్‌లో పార్టీ సానుబూతిపరులు, ఉపాధ్యాయుడు కనకాచారి అనే ఉపాధ్యాయుడు స్కూలుకు వెళ్ళుతుండగా, ఉదయమే సందడిగా ఉండే రోడ్డుపై హత్య చేసారు.

విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ‌సానుభూతిపరుడైన వరవరరావు గారిని చంపడానికి రెక్కీ నిర్వహించాని, ఒక ఐజి స్థాయి అధికారి స్కెచ్‌ ‌వేసి మలక్‌పేట చౌరస్తాలో,  వాళ్ళ పాత ఇంటి ఎదురుగా ఉండే మలక్‌పేట హాస్పిటల్‌ ‌గేటు దగ్గర నుండి సులభంగా కాల్చవచ్చని సూచించాడని పోలీసు అధికార్లలో గుసగుసలు సాగాయి. పోలీసు శాఖ సంపూర్ణ సహకారం మద్దతుతో నయీం పెద్ద నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. పెద్ద గ్యాంగ్‌ను ఏర్పరచుకొని వరంగల్‌, ‌నల్లగొండ, మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో సెటిల్‌మెంట్లు, బెదిరింపు వసూళ్లు, సుపారీ తీసుకుని హత్యలకు పాల్పడ్డాడు. పోలీసు శాఖలో అత్యున్నత అధికారి అయిన డిజిపి నుండి క్రింది స్థాయిలో ఉండే కానిస్టేబుల్‌ ‌వరకు సంబంధాలు పెట్టుకున్నాడు.

నయీం దాదాపు 12 మంది ఐపిఎస్‌ అధికార్లకు సంబంధాలు వున్నాయని, అందులో నలుగురు చాలా సన్నిహితంగా మెలిగే వారని నయీం చనిపోయిన తర్వాత పత్రికలు రాసాయి. నయీంతో భోంచేస్తూ, మాట్లాడుతూ ఉన్న పోలీసు ఆఫీసర్ల ఫోటోలు కూడాపత్రికల్లో ప్రచురి తమైనాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాలో అప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికార్లకు నయీం నెలకు 25 వేలనుండి 90 వేల వరకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డబ్బులు పంపేవాడని చెబుతుంటారు. అందులో డి.ఎస్‌.‌పి. స్థాయి నుండి ఎస్‌.ఐ. ‌స్థాయివరకు ఉన్నారు. 70 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు, 120 మంది కానిస్టేబుళ్లకు, 60 మంది పత్రికా విలేకర్లకు ప్రతి నెలా 25 వేలరూపాయలు పంపించేవాడట. ముగ్గురు సబ్‌ ‌రిజిస్ట్రార్లు, ఇద్దరు ఆర్‌.‌డి.ఓ.లు, ఆరుగురు ఎం.ఆర్‌.ఓలు ఆయన చెప్పు చేతల్లో ఉండేవారు. సబ్‌రిజిస్ట్రార్లు, స్టాంపులు తమతో తీసుకెళ్ళి నయీం ఇంట్లో కూర్చుని భూముల రిజిస్ట్రేషన్‌లు జరిపినట్టు కూడా సమాచారం ఉంది. ఈ విషయాలు చాలా వివరంగా నయీం ఎన్‌కౌంటర్‌ ‌తర్వాత పత్రికలు రాసాయి
.(రేపటి సంచికలో…)
– యస్‌. ‌జీవన్‌కుమార్‌

Leave a Reply