Take a fresh look at your lifestyle.

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

1998లో దళసభ్యుడు సోమ్లానాయక్‌ ‌నల్లగొండ జిల్లాలో కృష్ణపట్టి దళ నాయకుడిని, నలుగురు దళసభ్యులను వారు నిద్రలో
ఉండగా కాల్చివేసి, ఆయుధాలతో లొంగిపోయాడు. 1998 ఏప్రిల్‌ ‌నెలలో జడల నాగరాజు కరీంనగర్‌ ‌జిల్లా స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడు మల్కాపూర్‌ ‌భాస్కర్‌ను చంపి పోలీసులకు లొంగిపోయాడు. జడల నాగరాజు పోలీసుల చేత దళంలోకి పంపించబడ్డ వ్యక్తి అని పార్టీ ప్రకటన చేసింది. ఈ ముగ్గురికి ప్రభుత్వం భారీగా ధన సహాయం చేసింది. హోంమంత్రి, డిజిపి సమక్షంలో వాళ్ళుమేము హత్యలు చేసి బయటకొచ్చి లొంగిపోతున్నామని చెబితే, కేసులు పెట్టకుండా, ప్రభుత్వం వాళ్ళను ప్రశంసించింది.

1992 మే నెలలో పీపుల్స్‌వార్‌ ‌పార్టీ దాని అనుబంధ సంఘాలపై ప్రభుత్వం నిషేధం విధించి, అజ్ఞాతంలో ఉన్న వారిని బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలువాలని పిలుపునిచ్చి, వారి పునరావాసం కోసం బడ్జెట్‌ ‌కేటాయించి పథకాలు కూడా తయారు చేసి అమలు పరిచింది. తమకు పరిచయం ఉన్న రాజకీయ నాయకుల ద్వారా లొంగిపోవడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళినపుడు ఊరికే సరెండర్‌కాదు, రహస్యాలు చెప్పాలి, ఆయుధాలతో రావాలి, వీలునుబట్టి తమ సహచర కార్యకర్తలను చంపి బయటకు రావాలనే షరతులు విధించారు.

1993 నవంబర్‌ 18‌న కరీంనగర్‌ ‌జిల్లా, హుజూరాబాద్‌ ‌దళనాయకుడు భూపతిని, ఇంకాఇద్దరు దళసభ్యులను నిద్రలో ఉండగా కాల్చి చంపి కత్తులసమ్మయ్య, ఆయుధాలతో లొంగిపోయాడు. పోలీసుల జీపుల్లో తిరుగుతూ అందరిని బెదిరిస్తూ సెటిల్మెంట్లు చేస్తూ, బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటూ చిన్నపాటి మాఫియా నాయకుడుగా మారాడు. కత్తుల సమ్మయ్య ఆగడాలపై అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ‌పౌరహక్కుల సంఘం ప్రకటన చేస్తూ, ఆయన ప్రభుత్వం అండతోనే విచ్చలవిడిగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, ఆయనపై పోలీసులు కేసు కూడా పెట్టడం లేదు అంది. జవాబుగా అప్పటి హోంమంత్రి అసలు సమ్మయ్యతో పోలీసులకు సంబంధం లేదని, పార్టీ నుండి బయటకు వచ్చి రౌడీ అయ్యాడని ప్రకటించాడు. కొద్ది రోజుల తర్వాత కత్తుల సమ్మయ్య కొలంబియా విమానాశ్రయంలో విమానం నుండి దిగుతూ ప్రమాద వశాత్తు మరణించాడు. అప్పుడు ఆయన రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల కుమారులతో ప్రయాణిస్తున్నాడని పత్రికలు కథనాలు ప్రచురించాయి. అసలు ఆయనకు పాస్‌పోర్టు ఎలా వచ్చింది? దీనికి బాధ్యులెవరో విచారణ చేస్తామని డిజిపి ప్రకటించాడు.

1998లో దళసభ్యుడు సోమ్లానాయక్‌ ‌నల్లగొండ జిల్లాలో కృష్ణపట్టి దళ నాయకుడిని, నలుగురు దళసభ్యులను వారు నిద్రలో ఉండగా కాల్చివేసి, ఆయుధాలతో లొంగిపోయాడు. 1998 ఏప్రిల్‌ ‌నెలలో జడల నాగరాజు కరీంనగర్‌ ‌జిల్లా స్పెషల్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడు మల్కాపూర్‌ ‌భాస్కర్‌ను చంపి పోలీసులకు లొంగిపోయాడు. జడల నాగరాజు పోలీసుల చేత దళంలోకి పంపించబడ్డ వ్యక్తి అని పార్టీ ప్రకటన చేసింది. ఈ ముగ్గురికి ప్రభుత్వం భారీగా ధన సహాయం చేసింది. హోంమంత్రి, డిజిపి సమక్షంలో వాళ్ళుమేము హత్యలు చేసి బయటకొచ్చి లొంగిపోతున్నామని చెబితే, కేసులు పెట్టకుండా, ప్రభుత్వం వాళ్ళను ప్రశంసించింది.

నిజామాబాద్‌కు చెందిన హరిభూషణ్‌, ‌కరీంనగర్‌కు చెందిన బయ్యపు సమ్మిరెడ్డి కూడా ఇట్లాబయట కొచ్చి లైసెన్స్‌డ్‌ ‌క్రిమినల్స్‌గా తయారయిన వారే. వీళ్ళుమాజీ మిలిటెంట్లను వెంటేసుకొని, జీపుల్లో బహిరంగంగా ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ దోపిడీలు చేసారు. వాళ్ళవాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకున్నారు. వీళ్ళకు నగదు బహుమతులిచ్చి కేసులు పెట్టకపోవడం విషయంలో అప్పటి పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలగోపాల్‌గారు హైకోర్టులో కేసు వేసారు. 2002లో జస్టిస్‌ ఎ. ‌లక్ష్మణ్‌, ‌జస్టిస్‌ ఐ. ‌వెంకటనారాయణ ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం అవసరం లేదని తీర్పు చెప్పి కేసు కొట్టివేసారు.

నక్సలైట్లను అణచివేయడానికి కోవర్టులను ప్రవేశపెట్టే విధానాన్ని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మొదలు పెట్టి వ్యవస్థీకరించబడింది. 2000 సంవత్సరం ఏప్రిల్‌ ‌మాసంలో ఢిల్లీలో నక్సలైట్‌ ‌సమస్య ఉన్న రాష్ట్రాల డిజిపి, ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ‘‘నక్సలైట్‌ ‌మరియు ఇతర తీవ్రవాద సంస్థల గురించి ఖచ్చితమైన సమాచారం సంపాదించడానికి, వాళ్ళకు సంబంధించిన రహస్య సమాచారం అందిస్తూ, మనకోసం పనిచేసే వ్యక్తులను దళాల్లోకి ప్రవేశపెట్టే విధానాన్ని ఇతోధికంగా అమలు చేసే ప్రయత్నం చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన చేసాడు. స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుండి ఈ సూచన రావడంతో క్రింది స్థాయిలో ఉండే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌స్థాయి నుండి ఎస్‌.‌పి.లు, ఐ.జి.లు, డి.జి.పి.ల స్థాయి వరకు కోవర్టు విధానాన్ని అమలు చేసే ప్రయత్నాలు చేసారు. రాష్ట్ర డిజపిలుగా పనిచేసిన హెచ్‌.‌కె. దొర, కె. అరవింద రావుల కాలంలో ఈ పద్ధతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లాలో ఎస్‌.‌పి.లుగా పనిచేసిన ఆర్‌.‌కె. మీనా, గౌతమ్‌ ‌సావంగ్‌, ‌డిటి నాయక్‌, ఇం‌టలిజెన్స్ ‌డిజిలుగా పని చేసిన సజ్జనార్‌, శ్రీ‌రామ్‌ ‌తివారి, వెంకటేశ్వర్‌రావులు ఈ ప్రక్రియను బలోపేతం చేసినట్టుగా వారి పేర్లు వినపడ్డాయి. ఈ సమయంలోనే గ్రీన్‌ ‌టైగర్స్, ‌కాకతీయ కోబ్రాస్‌, ‌నల్లమల దండు, ప్రజా సైన్యం, దేశభక్తి పులులు లాంటి రహస్య సంస్థలు ఉనికిలోకి వచ్చాయి.

ఈ సంస్థలు సానుభూతిపరులను, హక్కుల సంఘాల కార్యకర్తలను ఫోన్లలో బెదిరించేవారు. ఎన్‌కౌంటర్‌ ‌సంఘటనపై నివేదికలు విడుదల చేసినప్పుడు, ఆ నివేదకలను ఖండిస్తూ పత్రిక ప్రకటనలు చేసేవారు. ఇట్లా సరెండర్‌ అయి లైసెన్స్‌డ్‌ ‌హంతకులుగా మారిన వాళ్ళంతా కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాలలో పోలీస్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్లలోనే ఉండేవారు. ఎప్పుడు పోలీసుల మధ్యలోనే తిరుగుతుండేవారు. అందరు లైసెన్స్‌లేని పిస్టల్లు పెట్టుకునేవారు. తీవ్ర నిర్బంధం అమలులో వున్న ఆ రోజుల్లో పోలీస్‌ ‌హెడ్‌క్వార్టర్స్ ‌ప్రాంతానికి, జిల్లా ఎస్‌.‌పి.ల ఆఫీసు ప్రాంగణంలోకి పోవడానికి ప్రజలు భయపడేవారు. ఎస్‌.‌పి.కి. పిటీషన్‌ ఇవ్వడం మామూలు ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండేది. పోలీసుల భయంతోపాటు, ఈ మాజీలు తమనెక్కడ చూస్తోరో, అది ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందో అని ప్రజలు భయపడేవారు.
ఈ విషయాలు ఇట్లా ఉంటే, పీపుల్స్‌వార్‌లో దళసభ్యుడిగా పనిచేసి బయటకొచ్చి ‘‘డాన్‌’’‌గా మారిన అబ్దుల్‌ ‌నయీముద్దీన్‌ ‘‌నయీమ్‌’ ‌కథ ఏంటో చూద్దాం.
(రేపటి సంచికలో…)
– యస్‌. ‌జీవన్‌కుమార్‌

Leave a Reply