Take a fresh look at your lifestyle.

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

siricilla, vemulawada constituency , municipality elections, district collector, krishna bhaskar
కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌

‌జిల్లాలోని సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీల ఎన్నిక లు పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేట్లుగా అన్ని రాజకీయ పార్ట్ణీల ప్రతినిధు లు,నాయకు లు,కార్యకర్తలు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌కోరారు.మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైన నేపధ్యంలో కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌మాట్లాడుతూ మున్పిపల్‌ ఎన్నికల డ్రాప్ట్ ఓటరు జాబితా పబ్లికేషన్‌, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమాలపై కలెక్టర్‌ అవగాహణ కల్పించారు.

ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి 2 వరకు తెలపాలని, వాటిని మరుసటిరోజు పరిశీలించి, 4న తుది జాబి తాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జనవరి 4న పోలిం గ్‌ ‌స్టేషన్ల డ్రాఫ్ట్ ‌నోటిఫికేషన్‌ ‌ప్రకటిస్తామని,దానిపై అభ్యంతరాలుంటే జనవరి 8 వరకు తెలపాలని,వాటిని పరిశీలించి 13న తుది పోలింగ్‌ ‌స్టేషన్ల జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.మున్పిపల్‌ ఎన్ని కలకు సంబంధించి జనవరి 7న నోటిఫికేషన్‌ ‌జారీ అవుతుందని,అంతకు ముందే జనవరి 5 వరకు రిజర్వే షన్లను ప్రకటిస్తామని తెలిపారు.

Tags: siricilla, vemulawada constituency , municipality elections, district collector, krishna bhaskar

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply