Take a fresh look at your lifestyle.

సైరన్‌ ..!

“ఫ్యూడల్‌ ‌రాజకీయ వ్యవస్థ అప్పట్లో తెలంగాణ మావోయిస్టులకు  ఇబ్బంది కలిగించలేదు. తెలంగాణ సాధించామన్న సంతృప్తి వారిలో ఉంది.  ప్రజలకు అధికారం ఇచ్చామన్న తృప్తి ఉండేది. అయితే, అక్కడే వారి అంచనాలు తలకిందులయ్యాయి. అన్ని రకాల సైద్ధాంతిక వైవిధ్యాలు,  వర్గాలు  వచ్చి చేరాయి. తెలంగాణలో కొత్త తరహా ఫ్యూడల్‌ ‌తరగతి మోసులెత్తింది. అనుకోని విధంగా  నిరంకుశ పోకడలు ఏకు మేకుల్లా తయారయ్యాయి.  దాంతో మావోయిస్టుల ఆలోచనల్లో  పరివర్తన ప్రారంభమైంది. ఎల్లకాలం వ్యూహాత్మకంగా దూరంగా ఉండటం వల్ల తెలంగాణలో అనుకున్నది సాధించేలేమన్న భావన వారిలో బయలుదేరింది.   ప్రత్యేక రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసం అప్పట్లో ఫ్యూడలిస్టులు, మతపరమైన శక్తులకు  మద్దతు ఇవ్వాల్సి వ చ్చిందని జనానికి  తెలియజేయడం కోసం మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.”

మావోయిస్టులు తెలంగాణలో తిరిగి ప్రవేశిస్తున్నారా..?

సిపిఐ(మావోయిస్టు) కి చెందిన ఐదుగురు సభ్యులు మైలారపు ఆదెల్లు అలియాస్‌ ‌భాస్కర్‌ ‌నేతృత్వంలో ఆసిఫాబాద్‌ ‌జిల్లా అడవుల్లో కి వస్తున్నట్టు సమాచారం అందిందని తెలంగాణ డిజిపి పేర్కొన్నారు. భాస్కర్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ప్రజలకు దూరంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదనీ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలోనే వారు తెలంగాణ అడవుల్లోకి వస్తున్నారని ఆయన చెప్పారు. వీరంతా చత్తీస్‌ ‌గఢ్‌ ‌కు చెందిన వారు. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రవేశించేందుకు వారు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత కాలంగా వారు వ్యూహాత్మకంగానే రాష్ట్రానికి దూరంగా ఉన్నారు. 2002 నుంచి పలు సందర్భాల్లో ఎదురు దెబ్బలు తిన్నారు. దాంతో చత్తీస్‌ ‌గఢ్‌ ‌లోనే ఉంటూ వచ్చారు.

అయితే, చత్తీస్‌ ‌గఢ్‌ ‌లో ఆపరేషన్‌ ‌ప్రహార్‌ ‌పేరిట ఎస్‌ ఎఫ్‌ ‌దళాలు గాలింపులు ఉధృతం చేయడంతో ప్రత్యామ్నాయ సేఫ్‌ ‌జోన్‌ ‌ల కోసం అన్వేషణ జరిపి చివరికి చత్తీస్‌ ‌గఢ్‌ ‌లో తలదాచుకున్నారన్నది తెలంగాణ పోలీసుల కథనం. అయితే, తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ‌పోలీసుల వాదాన్ని తోసిపుచ్చారు. పోలీసులు మావోయిస్టులపై దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారని ఆయన ప్రత్యారోపణ చేశారు . విశేషమేమిటంటే, ఈ ప్రకటనను తెరాస ప్రభుత్వ అధికార దినపత్రికలో ఈ ప్రకటన వెలువడింది. వారి ప్రకటనల మాట ఎలా ఉన్నా, తెరాస అధికార పత్రికలో పోలీసుల ప్రకటన, మావోయిస్టు పార్టీ కార్యదర్శి ప్రకటన ప్రచురించడం గమనార్హం.

మావోయిస్టులు ఇంతకాలం రాష్ట్రానికి దూరంగా ఉండటం వ్యూహాత్మకమే. తెలంగాణ ఉద్యమానికి వారు మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం జరిగే ఉద్యమంలో చొచ్చుకుని వెళ్ళాలని పార్టీ కేంద్ర మిలటరీ కమిటీ నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే మావోయిస్టు ఉద్యమం బలపడుతుందని ప్రచారం చేయడం వల్ల మావోయిస్టులు దూరంగా ఉండటానికి మరో కారణం కావచ్చు. ప్రత్యేక తెలంగాణ దండకారణ్య ప్రణాళిక కల సాకారానికి దోహదం చేస్తుందని కూడా కాంగ్రెస్‌ ‌ప్రచారం చేసింది. దండకారణ్యంలోనూ, తెలంగాణాలోనూ మావోయిస్టుల ప్రాబల్యం పెరగడానికి మాత్రమే ప్రత్యేక రాష్ట్రం ఉపయోగ పడుతుందని కూడా అప్పుడు ప్రచారం జరిగింది.. అయితే, తెలంగాణ వాదులు ఈ ఆరోపణను తిప్పికొట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకే ఇలాంటి ప్రచారాన్ని తెలంగాణా వ్యతిరేకులు చేస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. తెలంగాణ ఉద్యమం ఉన్నతస్థాయిలో ఉన్న నాయకులు, బూర్జువా పార్టీల నేతృత్వంలోని మధ్యతరహా నాయకులు తెలంగాణ ఉద్యమంలోకి మావోయిస్టులు చొచ్చుకుని వస్తున్నారన్న వాదాన్ని తోసిపుచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే, తెలంగాణ ఉద్యమం బలోపేతం అవుతుందని వారు స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా తెలంగాణ ఉద్యమంలోకి వివిధ ఎన్‌ ‌కౌంటర్‌ ‌లలో మరణించిన వారి కుటుంబ సభ్యులు చేరారు. మావోయిస్టులకు మేథోపరమైన మద్దతు ఇచ్చేవారు చేరారు. ఎన్‌ ‌కౌంటర్లన్నీ హోం మంత్రులు కొనసాగించినవని రాజకీయ నాయకత్వం నమ్మబలికింది.

మొత్తం మీద మావోయిస్టులు, వామపక్ష భావజాలం గల మేధావులు, కళాకారులు బూర్జువా నాయకత్వానికి ప్రత్యేక రాష్ట్ర సాధనలో తోడ్పాటును అందించారు. గద్దర్‌ ‌వంటి ప్రజా కళాకారులు కూడా ఉద్యమానికి ఊతమిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వారంతా తెరమరుగు అయ్యారు. తెలంగాణ ఉద్యమం వర్గ పరమైన శత్రువుల చేతుల్లోకి వెళ్ళేసరికి వారు తెరమరుగు అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపేందుకు వర్గపరమైన శత్రువులు తెలంగాణ ముసుగు వేసుకుని ప్రవేశించడం వల్ల సైద్ధాంతిక మైన సమస్యలను మాత్రమే సృష్టించలేదు. మావోయిస్టులకు సైద్ధాంతిక పరమైన సౌలభ్యానికి తోడ్పడింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టే ఏక సూత్ర కార్యక్రమం సాధనకు తోడ్పడుతుందని మావోయిస్టుల భావించారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం వల్ల తమ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయవచ్చని భావించిన మావోయిస్టులు సైద్ధాంతికంగా తమకు అనుకూల వాదుల వలలలో పడిపోయారు., ప్రజాస్వామ్య తెలంగాణ భావన కు ప్రభావితులయ్యారు.
2009 తర్వాత తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌ ‌చేతుల్లోకి వెళ్ళిన తర్వాత మార్క్సిస్టు, మావోయిస్టు సిద్ధాంత కర్తలకు మావోయిస్టుల దన్ను లేకపోవడం వల్ల వెనకబడి పోయారు. దాంతో వారు తప్పని సరిగా జేఏసీలకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఈ జేఏసీలన్నీ ఫ్యూడల్‌ ‌శక్తుల చేతుల్లో ఉన్నాయి.ఈ మార్క్సిస్టు మేధావులు ఫ్యూడల్‌ ‌తరగతి నాయకుల ఆమరణ దీక్షల వేదికలను పంచుకున్నారు. ఫ్యూడల్‌ ‌తరగతి నాయకుల ఎదుగుదల గురించి మావోయిస్టులు సక్రమంగా అంచనా వేయలేకపోయారు. విప్లవ కమ్యూనిజం, ప్యూడల్‌ ‌మెజారిటీ తెలంగాణ ఉద్యమం మధ్య సమతూకాన్ని అంచనా వేయలేకపోయారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా పునరుద్ధరించగలమో అంచనా వేయలేకపోయారు. ఫూడల్‌ ‌నాయకత్వం ఎదుగుదలను మావోయ్సుటుల ఆంధ్ర వలస వాద పెట్టుబడిదారులు, తెలంగాణ ఫ్యూడలిస్టుల మద్య పట్టు చేతులు మారే మజిలీ సమయంగా మావోయిస్టులు అంచనా వేసి ఉండవచ్చు.

సాయుధ పోరాటం వల్ల గ్రామాల్లో తాము కోల్పోయిన పట్టును ఫ్యూడల్‌ ‌తెలంగాణ నాయకులు తిరిగి సాధిస్తున్నారన్న వాస్తవాన్ని వారు తెలుసుకోలేకపోయారు. ఫ్యూడల్‌ ‌రాజకీయ వ్యవస్థ అప్పట్లో తెలంగాణ మావోయిస్టులకు ఇబ్బంది కలిగించలేదు. తెలంగాణ సాధించామన్న సంతృప్తి వారిలో ఉంది. ప్రజలకు అధికారం ఇచ్చామన్న తృప్తి ఉండేది. అయితే, అక్కడే వారి అంచనాలు తలకిందులయ్యాయి. అన్ని రకాల సైద్ధాంతిక వైవిధ్యాలు, వర్గాలు వచ్చి చేరాయి. తెలంగాణలో కొత్త తరహా ఫ్యూడల్‌ ‌తరగతి మోసులెత్తింది. అనుకోని విధంగా నిరంకుశ పోకడలు ఏకు మేకుల్లా తయారయ్యాయి. దాంతో మావోయిస్టుల ఆలోచనల్లో పరివర్తన ప్రారంభమైంది. ఎల్లకాలం వ్యూహాత్మకంగా దూరంగా ఉండటం వల్ల తెలంగాణలో అనుకున్నది సాధించేలేమన్న భావన వారిలో బయలుదేరింది. ప్రత్యేక రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసం అప్పట్లో ఫ్యూడలిస్టులు, మతపరమైన శక్తులకు మద్దతు ఇవ్వాల్సి వ చ్చిందని జనానికి తెలియజేయడం కోసం మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఉనికిని చాటు కోవడానికి వారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం,ఇంకా ప్రజాస్వామిక ఉద్యమాలకు బాసటగా నిలవడం ద్వారా రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవడానికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Leave a Reply