శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించిన భారతీయ మహిళలు ఎందరో ఉన్నారు. రసాయన శాస్త్రంలో ‘‘ఆర్బిటాల్’’ వంటి పలు పరిశోధనలు చేసిన గొప్ప శాస్త్రవేత్త ఆసియా ఛటర్జీ మన భారతీయురాలు. ఇస్రోలోని మొదటి శాస్త్రవేత్త మంగళమణి అంటార్కిటికా ప్రాంతంలో 23 సభ్యుల బృందానికి నాయకత్వం వహించి 403 రోజులు లాండ్స్కోప్ పరిశోధన చేశారు. భారత రాకెట్ మహిళ ‘‘రీతూ కరిదార్’’ ఇస్రో ఏరోస్పేస్ ఇంజనీర్ గా ఆర్బిటాల్ మంగళ్యాన్ మిషన్లో పాల్గొని దేశానికి సేవ చేస్తున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వివిధ విశ్వవిద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూవిద్యార్థులను,పరిశో
ధకులను మమేకం చేస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని వ్యాప్తి చేస్తున్నది.•
