హైదరాబాద్ మేయర్‌గా సింధూ ఆదర్శ్ రెడ్డి కానున్నట్లు సమాచారం. పటాన్ చెరు నియోజక వర్గంలోని భారతి నగర్ డివిజన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి భారీ మెజరిటీతో కార్పొరేటర్‌గా గెలుపొందారు. ప్రస్తుతం హైదరాబాద్ మేయర్ పీఠాన్ని జనరల్ మహిళకు రిజర్వు చేశారు.
దీంతో ఈ దఫా మేయర్ పీఠంపై రెడ్డి సామాజిక వర్గంకు చెందిన కార్పొరేటర్‌ను కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సింధూ ఆదర్శ్ రెడ్డిని మేయర్‌గా చేసేందుకు గానూ ప్రగతిభవన్ రావాలని శుక్రవారం రాత్రి కబురు పెట్టారని సమాచారం. ఇదిలా ఉంటే, సింధూ మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు.