Take a fresh look at your lifestyle.

నిరాడంబరంగా టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

  • తెలంగాణ భవన్‌లో జెండా ఎగురేసిన పార్టీ అధినేత కెసిఆర్‌
  • ‌పాల్గొన్న మంత్రులు, పార్టీ నేతలు
  •  ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఆవిర్భావ

వేడుకలు కరోనా కారణంగా సాదసీదాగా జరిగాయి. ఉద్యమ పార్టీ 20వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో పతాకావిష్కరణ చేశారు. ప్రగతి భవన్‌ ‌నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్‌ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ ‌సార్‌ ‌విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన పార్టీ 20వ ఆవిర్భావ వేడుకల్లో నేతలు భౌతిక దూరాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీకార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, •ం ‌మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌, ఎం‌పీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ ‌మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.టీఆర్‌ఎస్‌ ‌పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ‌జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేక్‌ ‌కట్‌చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ ‌బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. నిజామాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి వేల్పూర్‌ ‌మండల కేంద్రంలోని తన స్వగృహంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన వేల్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రక్తదానం చేశారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్‌ ‌హాల్‌లో పారిశుద్ధ్యకార్మికులు, వలస కార్మికులు, పార్టీ కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.

జంటనగరాల్లో అనేకమంది ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడే జెండాలను ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయా జిల్లాల్లో మంత్రులు, ముఖ్య నేతలంతా మాస్కులు ధరించి పాల్గొన్నారు. 2001 ఏప్రిల్‌ 27‌న ఆవిర్భవించిన తెరాస ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో వ్యూహప్రతివ్యూహాలతో అనేక జయాప జయాలు, ఒడుదుడుకులు ఎదుర్కొని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినా కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నిరాడంబరంగా జరపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ‌గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా ఎవరి ఇంటిపై వారు పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌సూచించారు. వారం రోజుల పాటు రక్తదానం చేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో ఎక్కడిక్కడే పార్టీ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగ ఆసాగాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!