Take a fresh look at your lifestyle.

సిగ్నల్‌ ‌ఫ్రీ కొరోనా..

“రోడ్లపైకి వేల సంఖ్యలో దూసుకొచ్చే వాహనాల విషయంలో భౌతిక దూరం అమలు కావటంలేదు.. వాహనాలు రెడ్‌ ‌సిగ్నల్‌ ‌పడగానే ఠక్కున నిలిచిపోతుండటంతో ఆప్రాంతంలో సోషల్‌ ‌డిస్టెన్సింగ్‌ ‌రూల్‌ ‌బ్రేక్‌ అవుతోంది.. కోవిడ్‌ ‌నిబందన అపహాస్యమవుతోంది..
ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఆటోల విషయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.. సిగ్నల్‌ ‌పాయింట్‌ ‌వద్ద ఏమాత్రం డిస్టెన్స్ ‌మెయింటెయిన్‌ ‌చేయకుండా వాహనాలను ఒకరి భుజం ఒకరికి తగిలేంత చేరువలో నిలుపుతున్నారు.”

ట్రాఫిక్‌ ‌సిగ్నళ్ళ వద్ద వాహనం ఆగటానికి ముందుకు సాగటానికి వ్యవధి కొన్ని సెకన్లు… కరోనా మహమ్మారి మనిషిని కాటేయటానికి ఈ సమయం చాలా ఎక్కువే… ఆరోగ్యవంతుడు వైరస్‌ ‌బాధితుడయ్యేందుకు ఈ సెకన్లు ఎక్కువే..సమాజమనే పడవ మునగకుండా ప్రభుత్వం కోట్ల కళ్ళతో రేయింబవళ్ళ కాపుకాసింది..కానీ.. చిల్లులన్నీ పూడ్చి ఎక్కడో ఒక రంధ్రాన్ని గమనించక పోయినా సరే..పడవ మునిగిపోతుంది..ఇన్నాళ్ళు నిద్రపోయిన తారు నదుల్లో ఇపుడు వాహనాలు ప్రవహిస్తున్నాయ్‌ … ‌లాక్‌ ‌డవున్‌ ‌సంకెళ్ళ సడలింపుతో స్పీడో మీటర్లు రయ్య్ ‌మంటున్నాయ్‌..‌రోడ్లపైకి వేల సంఖ్యలో దూసుకొచ్చే వాహనాల విషయంలో భౌతిక దూరం అమలు కావటంలేదు.. వాహనాలు రెడ్‌ ‌సిగ్నల్‌ ‌పడగానే ఠక్కున నిలిచిపోతుండటంతో ఆప్రాంతంలో సోషల్‌ ‌డిస్టెన్సింగ్‌ ‌రూల్‌ ‌బ్రేక్‌ అవుతోంది.. కోవిడ్‌ ‌నిబందన అపహాస్యమవుతోంది..ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు ఆటోల విషయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.. సిగ్నల్‌ ‌పాయింట్‌ ‌వద్ద ఏమాత్రం డిస్టెన్స్ ‌మెయింటెయిన్‌ ‌చేయకుండా వాహనాలను ఒకరి భుజం ఒకరికి తగిలేంత చేరువలో నిలుపుతున్నారు… సిగ్నల్‌ ‌పాయింట్‌ ‌వద్ద కరోనా తలెత్తే ప్రమాదం ఉందని కొందరు జగ్రత్తపరులు బాధ్యతాయుత పౌరులు ముందు వాహనాన్ని గమనించి కొంత వెనుకగానే తమ వాహనాన్ని నిలిపినా వారివెనుకవచ్చేవారు మాత్రం కరోనా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు.. సిగ్నల్‌ ‌మారేలోగా ముందుకు వెళ్ళిపోవాలనే ఆరాటం తప్ప కరోనా ప్రమాదం మరిచిపోతున్నారు..

ఆటోల్లో కూర్చున్న వారో డ్రైవరో, ద్విచక్రవాహనం వెనుక కూర్చునేవారో సెల్‌ ‌ఫోన్‌ ‌మాట్లాడుతున్నప్పుడో, తుమ్మినప్పుడో దగ్గినప్పుడొ వారిలో ఎవరికన్న వైరస్‌ ఉం‌డి ఉంటే తుంపర్ల ద్వారా వ్యాప్తి అయ్యే ప్రమాదం ఉంది ఇందువల్ల రోడ్లపై ఎరుపు ఆకుపచ్చ సిగ్నల్‌ ‌లైట్లు మరొక అర్దాన్ని సంతరించుకునే స్థితి పొంచి ఉంది…ఆకుపచ్చ అంటే కరోనా వైరస్‌ ‌వ్యాప్తి అని ఎరుపు అంటే తలెత్తే విపత్కర స్థితికి నిదర్శణం అని అర్థం తర్జుమా అయ్యే ప్రమాదమేర్పడుతోంది…కరోనా రక్కసి కట్టడిలో ప్రజలు మహమ్మారి బారిన పడకుండా చేసే చర్యల్లో పోలీసులు కీలక భూమికపోషించిన విషయం విదితమే… తమ సెలవులు మరిచి కుటుంబాలనొదిలి రోడ్లపైనే విధుల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే… కానీ పోలీసింగ్‌ ‌లో అంతర్భాగమైన ట్రాఫిక్‌ ‌రూల్స్ ‌కరోనాకు సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి… కరోనా వ్యతిరేక స్థితికి అనుగుణంగా ట్రాఫిక్‌ ‌చర్యలు లేకపోవటం ఈ సందేహాలకు  కారణం అవుతోంది.. చిన్న దుకాణం మొదలు పెద్ద స్టోర్‌ ‌వరకు కోవిడ్‌ ఆం‌క్షలు అమలవుతున్నాయి.. వినియోగదారులు బారులు తీరకుండా గుమికూడకుండా ఎగబడకుండా సోషక్‌ ‌డిస్టెన్సింగ్‌ ‌చర్యలు అమల్లోకొచ్చాయి…నిర్ణీత దూరదూరాన మనుషులు నిలిచేవిధంగా వృత్తాలు చదరాలు ఏర్పాటు చేస్తున్నారు…కానీ ఈ నిబంధన ట్రాఫిక్‌ ‌కు వర్తించదన్నట్టు వాహనదారులు ఎవరికివారు ప్రవర్తిస్తున్నారు.. కరోనాకు ముందు లా ట్రాఫిక్‌ ‌రూల్స్ ఇబ్బంది కనుక ట్రాఫిక్‌ ‌జోన్లను సిగ్నల్‌ ‌ఫ్రీ గా మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది… ఎరుపు ఆకుపచ్చ సిగ్నళ్ళ పేరుతో వాహనదారులను ఒక చోట గుమికూడ కుండా నిరోధించే చర్యల్లో బాగంగా ట్రాఫిక్‌ ‌కూడళ్ళను సిగ్నల్‌ ‌ఫ్రీగా మార్చాల్సి ఉంది…

ట్రాఫిక్‌ ‌కూడళ్ళ వద్ద వాహనాలు బెల్లం మీద ఈగల్ల ఒకచోట నిలబడిపోవటం కాక నిర్ణీత మార్గంలో ప్రయాణిస్తూ అవసరమైన చోట్ల యూ టర్న్ ‌లు తీసుకుంటూ కొంత అదనపు దూరం ప్రయాణించైనా సరే ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోవటమే సిగ్నల్‌ ‌ఫ్రీ విధానం..
నగరాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సిగ్నల్‌ ‌ఫ్రీ నిబంధనలు అమల్లో ఉన్నాయ్‌.. ఈ ‌నిబంధన పూర్తి స్థాయిలోకి తేవటంతోపాటు ఇప్పటికే ఈ విధానం లేని చోట ప్రవేశపెట్టాలి..కరోనా మానవాళి స్థితిగతులన్నీ మార్చేసింది.. ఏం పాటిస్తే కరోనా రహితం అవుతుందో ఆదిశగా ప్రపంచ రేఖలు వాలిపోతున్నాయి… ట్రాఫిక్‌ ‌నియంత్రణ కూడా తీరు మార్చుకోవలసి ఉంది.

srinivas k
కె.శ్రీనివాస్‌ 9346611455

Leave a Reply