Take a fresh look at your lifestyle.

రోడ్ల మీదకు వాహనం వస్తే సీజ్‌, ‌క్రిమినల్‌ ‌కేస్‌ : ‌సిపి

కర్ఫ్యూ సమయంలో ఎలాంటి కారణం లేకుండా రోడ్లమీదకు వచ్చే వాహనాలను సీజ్‌ ‌చేయడంతో పాటు క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేస్తామని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌హెచ్చరించారు. కోవిడ్‌-19 ‌నివారణలో భాగంగా ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిష నరేట్‌ ‌పరిధిలో సాయంత్రం 7గంటల నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగు తుందన్నారు. కర్ఫ్యూ సమయంలో మెడికల్‌ ‌షాపులు, హస్పటలకు మినహాయించి ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి ఎవరైన కారణం లేకుండా అనవసరంగా రోడ్ల మీదకు వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించ డంతో పాటు వారి వాహనాలను సీజ్‌ ‌చేసి క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా కర్వ్యూ సమయానికి ముందే ప్రభుత్వం మినహయింపు ఇచ్చిన వస్తువులకు సంబంధించిన షాపు యజమానులు సాయంత్రం ఆరు గంటలలోపే షాపుల ను మూసివేసి తిరిగి తమ ఇండ్లకు చేరుకోవాలన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు కూడ తమ కార్యకలపాలను పూర్తి చేసుకోని సాయంత్రం 7గంటల లోపే ఇండ్లకు చేరుకో వాలన్నారు. అదే విధంగా అత్యవసర విభాగా లకు సంబంధించిన ప్రభుత్వోగులకు మినహా యింపు ఇచ్చి నట్లు, కర్ఫ్యూ సమయాల్లో వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలోని అన్ని పోలీస్‌ ‌స్టేషన్ల పరిధిలో పోలీస్‌ ‌చెకింగ్‌ ‌పాయింట్లను ఏర్పాటు, ఆయా పోలీస్‌ ‌స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా పోలీస్‌ ‌పెట్రో లింగ్‌ ‌నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా నివారణ కోసం ప్రతి పౌరుడు తన వ్యక్తిగత భాధ్యతతో పాటు, ప్రభు త్వం సూచనలను పాటించాల్సిన భాధ్యత అందరిపై ఉందని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ అన్నారు.

Leave a Reply