Take a fresh look at your lifestyle.

తాను మరణించి ఏడుగురికి జీవితం ఇచ్చిన 13 ఏళ్ల బాలుడు సిద్ధూ

చిన్నతనంలోనే తన అవయవాలు దానం చేసిన చిన్నారి
భద్రాచలం,జూలై 22 (ప్రజాతంత్ర ప్రతినిధి): పట్టుమని పదమూడేళ్లు లేని ఆ కుర్రాడు పదిమంది ఇది ముందు సభలు సమావేశాలలో మాట్లాడాల్సి వస్తే అతని నోటి వెంట వచ్చేది రెండే మాటలు ’’అవయవ దానం, శాస్త్రీయ దృక్పథం కలిగిన జీవితం’’ హేతువాద ఆలోచనలతో ముందుకు వెళ్ళండి… ఎప్పుడైనా ఎక్కడైనా అతనిది ఇదే గొంతుక! .. అతని సిద్ధూ భద్రాచలం ఆదర్శానికి పర్యాయపదంగా ఉండే కార్యాచరణ శీలి డాక్టర్‌ ‌భాను ప్రసాద్‌, ‌సీత దంపతులు నాలుగవ కుమారుడు సామాజికంగా అన్యాయానికి బలైపోయిన అభాగ్యులను నేనున్నానని ఇంటికి తీసుకువెళ్లి సొంత బిడ్డ అరుదైన వ్యక్తిత్వం డాక్టర్‌ ‌భాను ప్రసాద్‌ ‌పెరుగుతున్న వారిలో సిద్దు బ్రెయిన్‌ ‌డెడ్‌ ఐ ‌తుది శ్వాస విడిచాడు అతని అవయవాలు దానం చేసి ఏడుగురికి ప్రాణభిక్ష పెట్టారు ఆ దంపతులు తమ బిడ్డ ఆశయాలకు ఆచరణ రూపం ఇచ్చారు.

నేను గాని నా కుటుంబం లో ఎవరైనా చనిపోతే దయచేసి కాల్చడం పూడ్చి పెట్టడం చేయకండి నా అవయవాలు ఎవరికైనా ఉపయోగపడేలా ఉంటే వారికి ఇచ్చి ప్రాణాలు నిలపండి అంటూ అతి చిన్న వయసు నుండి ప్రచారం చేస్తూ వచ్చిన 13 ఏళ్ల సిద్ధూ బ్రెయిన్‌ ‌డెడ్‌ ‌కు గురై బుధవారం శ్వాస విడిచాడు. ఇటీవల కొద్దిపాటి జ్వరం నుంచి కోల్కుంటూ ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళాడు దీంతో అతన్ని హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ వెంటిలేటర్పై రెండు రోజులు జీవన్మరణ పోరాటం చేసి చివరికి తుది శ్వాస విడిచాడు.. కాగా తన నా కోరిక , జీవితాశయం మేరకు శరీరాన్ని ఆసుపత్రికి అప్పగించి పనికొచ్చే అవయవాలను ఇతరులకు అందించమని డాక్టర్‌ ‌భాను ప్రసాద్‌ ‌సీత రమణులు తమ గొప్ప కార్యాన్ని చాటుకున్నారు.

ఎవరీ సిద్ధూ…! : సిద్దు భద్రాచలంలో డాక్టర్‌ ‌భానుప్రసాద్‌ ‌సీతారాముల పెంపకం లో ఉన్న సుమారు పది మంది పిల్లలలో ఒకరు సామాజికంగా అన్యాయాలకు గురైన బాధిత బిడ్డలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించి సొంత బిడ్డలా సాకీ వారినే ఉన్నతస్థితికి తీసుకురావడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న పరిపూర్ణ మానవతావాది, హేతువాది డాక్టర్‌ ‌భాను ప్రసాద్‌ ‌వారి ఇంట పెరుగుతున్న వారిలో సిద్దు ఒకడు చిన్ననాటినుంచే ఎంతో తెలివైన విద్యార్థి చలాకీగా ఉండే కుర్రాడు, భద్రాచలం త్రివేణి స్కూల్‌ ‌వారు ఇతని టాలెంట్‌ ‌గుర్తించి నర్సరీ నుంచి ఇప్పటి ఆరవ తరగతి వరకు ఉచిత విద్య ఇస్తున్నారు .ప్రాపంచిక దృక్పథం కలిగి శాస్త్రీయ నాస్తిక హేతువాద భావాలతో పెరిగిన చిన్నారి అంబేద్కర్‌ ఏ ‌కార్యక్రమం జరిగినా తాను ముందుండి తన మాట పాటలతో అందరిని కదిలించి చైతన్యపరిచే వాడు.

Leave a Reply