Take a fresh look at your lifestyle.

కొరోనా నిర్మూలనకు పాడి రైతుల భారీ విరాళం

  • దేశంలోనే మొదటి సారి సిద్ధిపేట రైతులచే ప్రారంభం
  • తమ వంతు భాగస్వామ్యంగా సిఎం సహాయ
  • నిధికి రూ.5 లక్షల 116 రూపాయల చెక్కు అందజేత

పాడి రైతులు కొరానా నిర్మూలనకు భారీ విరాళం ఇవ్వడం.. దేశంలోనే మొదటి సారిగా సిద్ధిపేట రైతుల నుంచే ప్రారంభమైంది.! పాలు పోసే పాడి రైతులు పెద్ద మనస్సుతో కరోనాను ఎదుర్కోవడంలో తమ వంతు భాగస్వామ్యం ఉండాలని ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం విజయ డైరీ చైర్మన్‌ ‌లోక భూమారెడ్డి, ఏండీ శ్రీనివాస రావు, ఉద్యోగ సిబ్బంది, జిల్లాలోని ప్రముఖ పాడి రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల 116 రూపాయల చెక్కును మంత్రి హరీశ్‌ ‌రావుకు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పాలు పోసే పాడి రైతులు పెద్ద మనస్సుతో ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని., కరోనా నేపథ్యంలో విజయ డైరీ సిద్ధిపేట బ్రాంచ్‌ ‌లో పాలు పోసే పాడి రైతులు ఒక్కరోజు పాలకు సంబధించిన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల 116 రూపాయల చెక్కు రూపంలో అందజేశారని వారికి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది సహయారార్థం ఈ విరాళాన్ని వినియోగిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం పాడి పరిశ్రమ, విజయ డైరీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గారు ఎప్పుడూ చేయూతను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల శాసన సభ సమావేశాల్లో విజయ డైరీ ఉద్యోగులు, రైతులను సీఏం అభినందించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి విజయ డైరీ, యాజమాన్యానికి, రైతులకు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. ఇన్సెంటీవ్స్ ‌విషయంలో కూడా బడ్జెట్‌ ‌లో పొందుపర్చామని, కరోనా దృష్ట్యా ముందుకు పోలేకపోయామని, ముందు ముందు ఆ పనులు పూర్తి చేసుకుందామని, సీఏం కేసీఆర్‌ ‌రైతు నాయకులు కాబట్టి రైతులు, పాడి రైతుల విషయంలో ప్రభుత్వం పాజిటీవ్‌ ‌గా ఉండి, పాడి రైతులను పూర్తిగా ఆదుకునే విధంగా ప్రభుత్వం ముందుకొస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. జిల్లాలో కరోనా వైరస్‌ ‌నిర్మూలనకు పాడి రైతులకు, సిబ్బందికి అవగాహన కల్పించి సీఏం సహాయ నిధికి విరాళం అందించేలా సమర్థవంతంగా పని చేసిన జిల్లా ఏడీ గోపాల్‌ ‌సింగ్‌ ‌ను మంత్రి అభినందించారు. సిద్ధిపేట జిల్లా పాడి రైతులను స్ఫూర్తి దాయకంగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని మంత్రి హరీశ్‌ ‌రావు పిలుపునిచ్చారు.

  • తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ సిద్ధిపేట విజయ డైరీ రైతులు ఆదర్శం
  • తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్‌ ‌లోక భూమా రెడ్డి, విజయ డైరీ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌ ‌రావు

రాష్ట్రంలోని రైతులందరికీ సిద్ధిపేట విజయ డైరీ రైతులు ఆదర్శంగా నిలిచారని తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి చైర్మన్‌ ‌లోక భూమా రెడ్డి, విజయ డైరీ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌శ్రీనివాస్‌ ‌రావులు తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వం సాయం అడిగే వారే, కానీ పాడి రైతులే ప్రభుత్వానికి సాయాన్ని అందించడం కరోనా నివారణకు దేశంలోనే మొదటి సారిగా పాడి రైతులు ముందుకు రావడం, సిద్ధిపేట జిల్లా పాడి రైతులతోనే ప్రారంభమైందని పేర్కొన్నారు. జిల్లా, సిద్ధిపేట నియోజక వర్గ పరిధిలోని తెలంగాణ విజయ డైరీ పాడి పాల రైతులు 15 వేల మంది రైతులు ఒక్కరోజు పాలకు సేకరించే బిల్లు రూ.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి, కరోనా సహాయ నిధికి అందిస్తున్నట్లు వివరించారు. పాడి పండించే రైతులు కరోనా పై స్పందించి మొదటి సారిగా ఇవ్వడం జరిగిందని, ఇది అభినందించదగిన విషయమని చెప్పుకొచ్చారు. రైతులను ఆదర్శంగా తీసుకుని, తెలంగాణ ప్రభుత్వం, సీఏం కేసీఆర్‌ ‌కరోనా పై చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని, మే నెల 7వ తేది వరకు లాక్‌ ‌డౌన్‌ ‌కు ప్రజలంతా సహకరించాలని, మనల్ని మనం రక్షించుకోవాలంటే.. మన ఇళ్లలోనే మనం ఉంటూ కరోనా మహమ్మారిని అంతమొందిద్దామని కోరారు. తెలంగాణ విజయ డైరీ సమైక్య రాష్ట్రంలో ఎంతో నష్టపోయిందని, నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో అసెంబ్లీలో రూ.25 కోట్లు వెచ్చించిన సీఏం కేసీఆర్‌ ‌కు కృతజ్ఞతలు తెలిపారు. విజయ డైరీ అన్నీ రకాలుగా అభివృద్ధి పథంలో నడిచేలా ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విజయ డైరీ పాడి రైతులకు రూ.4 రూపాయలు నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నామని, విజయ డైరీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. జిల్లాలో ప్రతి రోజూ 40వేల లీటర్ల పాలు విజయ డైరీ తరపున సేకరిస్తూ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ జనరల్‌ ‌మేనేజర్‌ ‌మల్లిఖార్జున్‌ ‌రావు, జిల్లా చైర్మన్‌ ‌లక్ష్మారెడ్డి, టీఐపీ మెంబరు ఏం.రాంచంద్రారెడ్డి, కోశాధికారి ఉప్పల్‌ ‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మెగానాథ్‌ ‌రెడ్డి, భూపాల్‌, ‌చంద్రారెడ్డి, లక్ష్మణ్‌, ఏఓ ‌విజయ్‌ ‌కుమార్‌, ‌విజయ డైరీ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!