Take a fresh look at your lifestyle.

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారు..

  • టీఆరెస్ ధీమా పోలీసులు -కలెక్టర్
  • కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు మేఘా కృష్ణారెడ్డి పంపితే ఎన్నికల్లో పంచుతున్నారు :ఎమ్మెల్యే జగ్గా రెడ్డి 
సంగారెడ్డి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి దుబ్బాక ఉపఎన్నికల పై ప్రభుత్వ తీర్పు పై ఘాటుగా స్పందించారు. దుబ్బాక లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం బాధాకరమని కానీ దుబ్బాకలో టీఆరెస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుందని అన్నారు . రూలింగ్ పార్టీ కావడం వల్ల టీఆరెస్ కు చాలా అనుకులతలు ఉంటాయని తెలిపారు .బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ …. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కు పెద్దకొడుకు పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు .ఎన్నికల పోలింగ్- ఫలితాలు రాకముందే టీఆరెస్ గెలిచినట్లు ప్రకటన చేస్తున్నారని దుబ్బాక లో టీఆరెస్ గెలుపు ఖాయం అయిందని మెజారిటీ మాత్రమే అని మంత్రి హరీష్ రావు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు .
దుబ్బాక లో టీఆరెస్ ధీమా  పోలీసులు- కలెక్టర్ సపోర్ట్ చేస్తున్నారని  దుబ్బాక ప్రజలు- రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని సూచించారు .దుబ్బాక లో టీఆరెస్ గెలిస్తే- మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీఆరెస్ కు సీఎం పీఠం ఇచ్చినట్లేనని టీఆరెస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకున్నా కారు గెలిస్తే మళ్ళీ కేసీఆర్ కాలర్ ఎగరేస్తడని అన్నారు . ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తెచ్చినా ప్రజలు పట్టించుకోపోతే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపడలేరని రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల అన్ని పంటలు నాశనం అయ్యాయని ప్రజల సమస్యలను తీర్చుకునేందుకు ఎమ్మెల్యేలు- ప్రజాప్రతినిధులు- కానీ తెలంగాణలో అంతా రివర్స్ నడుస్తోందని ఆరోపించారు .రాష్ట్ర ప్రజలందరూ దుబ్బాక లో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీఆరెస్ ను ఓడించమని చెప్పాలని ఉస్మానియా- కాకతీయ విద్యార్థి పిల్లలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు .ఉద్యమంలో టీఆరెస్ అన్నారు ఉద్యోగం రాలేదు…ఇప్పుడైనా మేల్కొండని పిలుపునిచ్చారు.
దుబ్బాక లో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని టీఆరెస్ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ వరదలు వస్తాయని అన్నారు .దుబ్బాక ప్రజలు తమ జీవితాలు మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని  హరీష్ రావు దుబ్బాక లో దొంగమాటలు మాట్లాడుతుండని ఆగ్రహం వ్యక్తం చేశారు .దుబ్బాక లో టీఆరెస్ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి ఉండదని వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట టిక్కెట్టు ఉండదని భవిష్యత్తు చెప్పారు .దుబ్బాక ఉపఎన్నిక హరీష్ రావు రాజకీయ జీవితం ముడిపడి ఉందన్నారు .కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు మేఘా కృష్ణారెడ్డి పంపితే ఎన్నికల్లో పంచుతున్నారని మారుతి కారులో తిరిగే మేఘా కృష్ణారెడ్డి 10 ఏండ్లు వ్యాపారం చేస్తే హెలికాప్టర్ వస్తదని నిలదీశారు .

Leave a Reply