Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న సిద్దిపేట బిజెపి నాయకులు అరెస్ట్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపుమేరకు సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తూ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో సిద్దిపేట బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పాల్గొన్నారు. పోలీసులు నాయకుల కదలికలపై నిఘా పెట్టినప్పటికీ చాకచక్యంగా  అసెంబ్లీ రెండవ గేట్‌ ‌సమీపంలోకి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. కాసేపు తోపులాట ఉద్రిక్తత నెలకొంది. బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌ ‌రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ ‌స్టేషనుకు తరలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో నిజామును మించి నియంత పాలన కొనసాగుతుందని,అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.

కెసిఆర్‌ ఉద్యమ సమయంలో తెలంగాణా వస్తే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్‌ ‌గవర్నమెంట్‌లో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య పై చిందులు వేసిన కేసీఆర్‌ ఈనాడు నోరు మూసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా సెప్టెంబర్‌ 17‌న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని లేకపోతే మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.ముట్టడి కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోనీ సురేష్‌ ‌గౌడ్‌, ‌బిజెపి ప్రధాన కార్యదర్శులు బూరుగు సురేష్‌ ‌గౌడ్‌,‌కోడూరి నరేష్‌ ‌తదితరులు సురేష్‌ ‌మూర్తి కరుణాకర్‌ ‌పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!