Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట ఫార్మూలనే హుజూరాబాద్‌లో….

వోటు వోటు పడేలా….గెల్లు గెలుపే లక్ష్యంగా
2లక్షల పైచిలుకు వోటర్లు…305పోలింగ్‌ ‌కేంద్రాలు
3వేల మంది ఇంఛార్జులు?
ప్రతీ 100వోట్లకు ఓ ఇంఛార్జి
ఓవరాల్‌ ఇం‌ఛార్జితో పాటు…
హుజూరాబాద్‌ ‌టౌన్‌, ‌రూరల్‌ ‌మండలాలకు ప్రత్యేక ఇంఛార్జిగా మంత్రి హరీష్‌రావు
పోలింగ్‌కు వారం ముందే ఎన్ని వోట్లొస్తాయో తెలిసేలా సేకరణ
సిద్ధిపేటలో సక్సెస్‌తో హుజూరాబాద్‌లో వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ట్రబుల్‌ ‌షూటర్‌!
‌హరీష్‌రావు దూకుడు తట్టుకోవడం కష్టమే మరి!!
‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌

(ఎ.‌సత్యనారాయణరెడ్డి / హైదరాబాద్‌ / ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) :
తన్నీరు హరీష్‌రావు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌గా పేరు. రాత్రింబవళ్లు కష్టపడే మనస్తత్వానికి, అభివృద్ధికి కేరాఫ్‌. ‌వినూత్న ప్రయోగాలను సక్సెస్‌ ‌చేయడంలో మంచి దిట్ట. ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఆయన సొంతం. పార్టీ అధినేత, సిఎం కేసీఆర్‌ అప్పగించే ఎలాంటి టఫ్‌ ‌టాస్క్‌నైనా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే నేతగా హరీష్‌రావుకు పేరుంది. అనేక పర్యాయాలు రుజువైంది కూడా. ఇప్పుడు తాజాగా…హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌గెలుపు బాధ్యతను సిఎం కేసీఆర్‌..‌మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. ఈటల రాజేందర్‌ ‌రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌గెలుపు బాధ్యతను పూర్తిగా తన భజస్కందాలపై వేసుకున్న మంత్రి హరీష్‌రావు…2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించిన ఫార్మూలానే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో అమలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 8తో హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌కు సంబంధించి నామినేషన్ల పక్రియ ముగిసింది. ఈ నెల 13తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నది. ఇక ప్రచారానికి కేవలం 17రోజులు మాత్రమే మిగిలింది. అయితే, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించడం కోసం మంత్రి హరీష్‌రావు గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా బిజీగా గడుపుతున్నాడు.

పోలింగ్‌కు టైం దగ్గరపడుతుండటంతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌గెలుపే ఏకైక ‘లక్ష్య’ంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అక్కడే మకాం వేసి ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నాడు. ఇతర పార్టీల నుంచి భారీగా నేతలు, కార్యకర్తలను కారెక్కిస్తూ.. ప్రత్యర్థులను ఆగమాగం చేస్తున్నాడు. ప్రధానంగా బిజెపి పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మంత్రి హరీష్‌రావు వ్యూహాలకు, దూకుడుకు ప్రత్యర్ధి పార్టీల నేతలు జుట్టుపీక్కుంటున్నారు. ఇదిలా ఉంటే, కమలాపూర్‌, ‌హుజూరాబాద్‌ ‌నుంచి ఈటల రాజేందర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా వరుసగా 6 పర్యాయాలు గెలిచాడు.

The Siddhipet formula is in Huzurabad ....

గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిగా తమ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 43 వేల పైచిలుకు వోట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే, భూ కజ్జాల ఆరోపణలతో రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి సిఎం కేసీఆర్‌ ‌బర్తరఫ్‌ ‌చేయడంతో రాజేందర్‌ ‌టి•ఆర్‌ఎస్‌ను వీడి బిజెపిలో చేరడంతో… హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి వరుసగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలుస్తూ వొస్తున్నాడు. ఈ ఉప ఎన్నికలోనూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించడం కోసం మంత్రి హరీష్‌రావు తనదైనశైలిలో పావులు కదుపుతున్నాడు. ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు. ఈ ఉప ఎన్నికలోనూ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట తరహాలోనే వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారని అత్యంతమైన విశ్వసనీయవర్గాలు శనివారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. హరీష్‌రావు దూకుడును ప్రత్యర్థి పార్టీల నేతలు తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో. దీనిపై ‘ప్రజాతంత్ర’ అందిస్తున్న ప్రత్యేక కథనం…

ప్రతి వోటు టిఆర్‌ఎస్‌కు పడేలా… ప్రతి 100వోట్లకు ఓ ఇంఛార్జి…
హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించడమే లక్ష్యంగా మంత్రి హరీష్‌రావు పని చేస్తున్నాడు. గెల్లును గెలిపించడం కోసం, ఈటల రాజేందర్‌ను ఓడించడం కోసం హరీష్‌రావు పక్కా ప్రణాళిక, వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. గెల్లు గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నారు హరీష్‌రావు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో కమలాపూర్‌, ‌వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్‌ ‌టౌన్‌, ‌రూరల్‌ ‌మండలాలున్నాయి. 2 లక్షల పై చిలుకు వోటర్లు ఉండగా…305పోలింగ్‌ ‌కేంద్రాలు ఉన్నాయి. ప్రతి మండలానికి మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌, ‌రాష్ట్రస్థాయి లీడర్‌ ఇం‌ఛార్జిగా ఉంటారు. గ్రామానికి కలిపి ఒకరు ఇంఛార్జిగా ఉంటారు. మరలా వార్డుకు, బూతుకు కూడా ఇంఛార్జులు ఉంటారు. వీరితో పాటు ప్రతి 100వోట్లకు ఒక్కరు చొప్పున ఇంఛార్జిని నియమించినట్లు సమాచారం. ఈ ఎన్నికలలో వోటింగ్‌ ‌శాతంను పెంచడంతో పాటు ప్రతి వోటు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కారు గుర్తుకు పడేలా ప్రతి వంద వోట్లకు ఒక ఇంఛార్జి చొప్పున సుమారుగా 3 వేల మందిని ఇంఛార్జులుగా నియమించినట్లు ఇక్కడికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఓవరాల్‌గా నియోజకవర్గం మొత్తానికి మంత్రి హరీష్‌రావు ఇంఛార్జిగా ఉన్నప్పటికీ…హుజూరాబాద్‌ ‌టౌన్‌, ‌రూరల్‌ ‌మండలాలకు ప్రత్యేకంగా మంత్రి హరీష్‌రావే ఇంఛార్జిగా ఉన్నట్లు సమాచారం. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించడం కోసం మంత్రి హరీష్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో తను సిద్ధిపేటలో లక్షకు పైగా వోట్ల మెజారిటీతో గెలిచేందుకు అనుసరించిన సరికొత్త వినూత్న ఫార్మూలాను ఇప్పుడు హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌లో అమలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి వంద వోట్లకు ఇంఛార్జిగా నియమించిన సదరు నాయకుడు తనకు అప్పగించిన వంద వోటర్లకు సంబంధించి…గ్రామం, వార్డు, పోలింగ్‌ ‌బూత్‌ ‌నెంబర్‌, ‌పోలింగ్‌ ‌కేంద్రం, వోటరు పేరు, వోటరు పురుషుడా? స్త్రీయా? మొబైల్‌ ‌నెంబర్‌, ఇం‌టి నెంబర్‌, ‌కులం, వృత్తి, ప్రస్తుత నివాసం, ప్రభుత్వ పథకాల లబ్దిదారులా? అయితే వివరాలు.

ఏ పార్టీకి చెందిన వారు. ఏ పార్టీకి వోటేస్తారు. మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య. వోటు హక్కు కలిగి ఇతర ప్రాంతాలలో చదువుకుంటున్న వారి వివరాలు, మొత్తం వోటర్ల సంఖ్య తదితర వివరాలను అన్నింటిని సేకరిస్తారు. ఈ సేకరించిన వివరాలపై మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారనీ సమాచారం.. ఈ సేకరణ వల్ల ప్రజల మూడ్‌ ఎలా ఉంది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ పని తీరు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అభ్యర్థి పని తీరుపై ప్రజల నుంచి ముందస్తుగానే ఒక ఫీడ్‌బ్యాక్‌ ‌వొచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ సేకరణతో పోలింగ్‌కు వారం, పది రోజుల ముందుగానే ఎన్ని వోట్లు పడే అవకాశం ఉందనేది తెలిసి, ఎంత మెజారిటీతో గెలుస్తామనే దానిపై ఒక అంచనాకు వొచ్చే అవకాశం ఏర్పడుతుందనేది హరీష్‌ ఆలోచనగా తెలుస్తున్నది. ఏమైనా లోటు పాట్లు ఉన్నా, ప్రజలు అసంతృప్తితో ఉన్నా పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నందునా పోలింగ్‌ను పెంచేందుకు, వోట్లెయ్యడానికి వెనుకా ముందు ఆలోచన చేసేవాళ్లు ఎలాగయితే వోట్లు వేసే అవకాశం ఉందో తెలుసుకోవడానికి వంద వోట్ల ఇంఛార్జి పని తీరు, సేకరణ టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి బాగా ఉపయోగపడుతుందనీ తెలుస్తున్నది. దీంతో పాటు హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే ఇంకా ఏమేమీ చేస్తామనే దానిపై విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. ఒక్కో ఇంఛార్జి వంద మంది వోటర్ల వద్దకు వెళ్లి వారితో ముచ్చటిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ‌నుంచి ఇంకా మీరేం ఆశిస్తున్నారు? ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. గెల్లును ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. వోటర్ల లిస్టుతోపాటు, టిఆర్‌ఎస్‌ ‌చేసిన అభివృద్ధికి సంబంధించిన పత్రాలను తమ వెంట తీసుకెళ్తూ వోటర్లకు అందులోని వివరాలు చేరవేస్తున్నారనీ ఇక్కడికి అందిన సమాచారాన్ని బట్లి తెలుస్తుంది. పోలింగ్‌ ‌కేంద్రాల వారీగా, వంద వోట్ల ఇంఛార్జిలతో హరీష్‌రావు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారనీ, ఇంఛార్జిలు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా హరీష్‌రావు వారికి ఎప్పటికప్పుడు పలు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు దిశానిర్దేశం చేస్తునట్లు సమాచారం.

ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వోటర్లపై దృష్టి..
త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ‌బై ఎలక్షన్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించడం కోసం సిద్ధిపేట తరహాలో హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న వంద వోట్ల ఇంఛార్జి ప్రయోగంతో హుజూరాబాద్‌ ‌పట్టణంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన వోటర్లు ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్నట్లు స్పష్టమైంది. దీంతో ఉద్యోగ రీత్యా, బతుకు దెరువు రీత్యా, చదువు రీత్యా ఇతర ప్రాంతాలలో ఉంటున్న పలువురు వోటర్లు పోలింగ్‌ ‌తేదీ వరకు హుజూరాబాద్‌క•• వొచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనీ, దీనిలో భాగంగానే ఇతర ప్రాంతాలత్లో ఉంటున్న వోటర్లు ఈ నెల 30న జరిగే పోలింగ్‌ ‌తేదీకి ముందే హుజూరాబాద్‌క•• వొచ్చేలా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Leave a Reply