Take a fresh look at your lifestyle.

ఎస్‌ఐ శ్రీ‌నివాసరెడ్డి రిమండ్‌కు తరలింపు

తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షింపబడతారన్న ఎస్‌పి
మహబూబాబాద్‌, ఆగస్ట్ 4 :  ‌జిల్లాలోని మరిపెడ ఎస్‌ఐ శ్రీ‌నివాస్‌ ‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఎన్‌.‌కోటిరెడ్డి తెలిపారు. పద్నాలుగు రోజులు రిమాండ్‌ ‌విధించగా ఆయనను మహబూబాబాద్‌ ‌సబ్‌-‌జైల్‌కు తరలించామన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్షింపబడతారని స్పష్టం చేశారు. కేసు పురోగతిలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామన్నారు. కాగా, నిన్న ట్రైనీ ఎస్‌ఐపై ఎస్‌ఐ శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే.

Leave a Reply