కేంద్ర మంమ్రండలి ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం
హైదరాబాద్, పిఐబి, జనవరి 11 : కోల్ కాతా లోని జోకాలో గల నేశనల్ సెంటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్, సానిటేషన్ అండ్ క్వాలిటీ పేరును మార్చివేస్తూ ఆ సంస్థకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేశనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ ఎండ్ సానీటేషన్(ఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) అనే పేరు పెట్టేందుకు కేంద్ర మంత్రిమండలి ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సంస్థను పశ్చిమ బంగాల్లో కోల్ కాతా లోని జోకా కు చెందిన డాయమండ్ హార్బర్ రోడ్డు లో 8.72 ఎకరాల భూమి మీద స్థాపించడం జరిగింది. శిక్షణ కార్యక్రమాల మాధ్యమం ద్వారా పబ్లిక్ హెల్థ్ ఇంజినీరింగ్, త్రాగునీరు, పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య రక్షణల రంగంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో సామర్థ్యాన్ని వికసింపచేసే ఒక ప్రముఖ సంస్థగా దీనిని ఏర్పాటు చేశారు.
ఆ తరహా సామర్థ్యాలను కేవలం స్వచ్ఛ్ భారత్ మిశన్ మరియు జల్ జీవన్ మిశన్ల అమలులో నిమగ్నం అయిన ఫ్రంట్ లైన్ వర్క్ ఫోర్స్కే కాకుండా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. దీనికి అనుగుణంగా శిక్షణ సంబంధి మౌలిక సదుపాయాలు, పరిశోధన మరియు అభి వృద్ధి (ఆర్ ఎండ్ డి) బ్లాకు, ఒక నివాస భవన సముదాయం సహా తగిన మౌలిక సదుపాయాల స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో శిక్షణను అందించడానికి వాటర్ సానిటేషన్ అండ్ హైజీన్ (డబ్ల్యుఎఎస్ హెచ్) సంబంధిత సాంకేతికతలకు చెందిన కార్యాచరణ ప్రధానమైనటువంటి, ఇంకా సూక్ష్మ నమూనాల ను కూడా నెలకొల్పారు.