Take a fresh look at your lifestyle.

‘మిషన్ మోడ్ ‘ ప్రాజెక్టుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ II

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎస్‌పి) స్టేజ్ II తో సహా తెలంగాణలో కొనసాగుతున్న మరో పదకొండు ప్రాజెక్టులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయబోయే 99 ప్రాధాన్యత ప్రాజెక్టులలో చేర్చబడ్డాయి అని మంత్రి రత్తాన్ లాల్ కటారియా తెలిపారు. తెలంగాణలోని పిఎంకెఎస్‌వై కింద,శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ II ను 1,78,000 హెక్టార్ల లక్ష్యంగా నీటిపారుదల ప్రొటెన్షియల్‌తో చేపట్టడం నిజమేనా…..నిజం అయితే వివరాలు తెలపండి. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి నిర్ణయించిన అసలు గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉందా….?ఉంటే ఎలా తెలపండి. గత మూడు సంవత్సరాలలో మరియు ప్రస్తుత సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన, మంజూరు చేసిన, విడుదల చేసిన మరియు ఉపయోగించిన నిధులు ఎంత..? అని గడ్డం రంజిత్ రెడ్డి జలశక్తి మంత్రాలయాన్ని ప్రశ్నిచారు.

ఈ ప్రశ్నలకి జలశక్తి కేంద్ర సహాయ మంత్రి రత్తాన్ లాల్ కటారియా లిఖిత సమాధానం ఇచ్చారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ (ఎస్‌ఎస్‌పి) స్టేజ్ II తో సహా తెలంగాణలో కొనసాగుతున్న మరో పదకొండు ప్రాజెక్టులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయబోయే 99 ప్రాధాన్యత ప్రాజెక్టులలో చేర్చబడ్డాయి అని మంత్రి రత్తాన్ లాల్ కటారియా తెలిపారు.ప్రధాన మంత్రి కృషి సిచ్చాయి యోజన – యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రాం (పిఎంకెఎస్‌వై-ఎఐబిపి) కింద జల శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ చర్యలు తీసుకోబడినాయి. ఈ ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ నాబార్డ్ ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వాటాలు అనే పద్దతిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఎస్‌ఎస్‌పి స్టేజ్ II యొక్క అల్టిమేట్ ఇరిగేషన్ పొటెన్షియల్ (యుఐపి) 178.066 వేల హెక్టార్లు. పిఎమ్‌కెఎస్‌వై-ఎఐబిపి కింద చేర్చే సమయంలో, ఎస్‌ఎస్‌పి స్టేజ్ II జూన్, 2019 నాటికి పూర్తి కావాలని ప్రణాళిక వేశారు. అయితే, భూసేకరణ ఆలస్యం, నిర్మాణాలు పూర్తికాని కారణంగా, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇప్పుడు షెడ్యూల్ మార్పు చేయవలసి వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి, 2021 కి ప్రాజెక్ట్ పూర్తి కావాలని ప్రణాళిక వేశారు.పిఎంకెఎస్‌వై-ఎఐబిపి కింద ప్రాజెక్టుకు మొత్తం కేంద్ర సహాయం (సిఎ) అర్హత 48.36 కోట్లు, సిఎ ఇప్పటివరకు విడుదల చేసిన 39.29 కోట్లు.

Leave a Reply