హైదరాబాద్, జనవరి 17 : న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్‌ను పక్కన పెట్టేశారు. అతని స్థానంలో టీమిండియా జట్టులోకి రజత్ పటిదార్‌ను తీసుకున్నారు. వెన్ను నొప్పి వల్ల అయ్యర్‌ను తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లో అయ్యర్.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మూడుసార్లు మంచి స్టార్ట్ తీసుకున్నా.. పెద్ద స్కోర్లు చేయలేకపోయాడు. బుధవారం హైదరాబాద్‌లో తొలి వన్డే జరగనున్నది. దీంతో అతని స్థానంలో పటిదార్ జట్టులోకి వచ్చాడు.