Take a fresh look at your lifestyle.

రాష్ట్ర అధ్యకుడి ఎంపికతో కాంగ్రెస్‌ ‌మరింత బలహీనపడనుందా ?

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుండీ కొడిగడుతూ వొస్తుంది. రెండు రాష్ట్రాలను ఏర్పరిచిన ఘనత ఆ పార్టీకి ఏమాత్రం దక్కకుండా పోయింది. ఆనాటి నుండి రెండు రాష్ట్రాల్లోనూ క్రమేణ తన ప్రాచుర్యాన్ని కోల్పోతూ వొస్త్తుంది. ఇంతో అంతో ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉందని అనిపించుకుంటున్నా, ఏపిలో మాత్రం పూర్తిగా కనుమరుగైందనే చెప్పవొచ్చు. తెలంగాణలో కూడా నిన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న ఈ పార్టీని బిజెపి పక్కకు తోసింది. దీంతో ఇప్పుడాపార్టీకి మనుగడే ప్రశ్నార్థకమైంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో జరిగిన వరుస ఎన్నికల్లో ప్రజ) విశ్వాసాన్ని కోల్పోతున్న ఈ పార్టీకి సరైనా సారథ్యం లేకపోవడం ఒక కారణం కాగా, దేశ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్‌ ‌ప్రతిష్ట మసకబారతుండడం మరో కారణంగా మారింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి రథ సారథులెవర్న విషయాన్ని మూడు నాలుగేళ్ళుగా ఆ పార్టీ నిర్ణయించుకోలేకపోతోందంటేనే సంస్థాగతంగా ఆ పార్టీ ఏమేరకు పటిష్టంగా ఉందన్నది స్పష్టమవుతోంది.

యథారాజా తథా ప్రజ అన్నట్లు కేంద్రంలో తాత్కాలిక సారథితో నెట్టుకొస్తున్నట్లే, రాష్ట్రంలో కూడా ఆ పార్టీ సారథిని మార్చడానికి ఒక విధంగా అధిష్టానం భయపడుతూ వొచ్చిందనే చెప్పాలె. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపికన్నది ఎప్పుడూ వివాదగ్రస్తమే. ఆ పదవిని కోరుకునేవారు తమ అనుకూల కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌ల చుట్టూ చక్కర్లు కొట్టడం అనవాయితీగా వొస్తున్నదే. ఈసారి కూడా అందుకేమీ అతీతం కాదు. దుబ్బాక, జీహెచ్‌ఎం‌సి ఎన్నికల తర్వాత నైతిక బాధ్యతగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి తన రాజీనామాను సమర్పించడంతో అధిష్టానానికి కొత్త అధ్యక్షుని అన్వేషణ తప్పని పరిస్థితి అయింది. డిసెంబర్‌ 16‌వ తేదీ మొదలు నాలుగు రోజులపాటు అన్ని క్యాడర్‌కు సంబంధించిన నాయకుల, ప్రజాప్రతినిధుల నుండి సమాచారం సేకరించిన రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జి మాణికం టాగూర్‌ అధిష్టానానికి ఏం రిపోర్టు ఇచ్చారో గాని రాష్ట్ర నాయకుల్లో కల్లోలం మొదలైంది. పార్టీ ఒడిదొడుకులను తట్టుకుని దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్నవారిని కాదని, వలస నాయకులకు పార్టీ పగ్గాలను అప్పగించే అవకాశాలపై వొస్తున్న వార్తలే ఈ కలకలానికి కారణమవుతోంది. ఇది ఒక విధంగా అధిష్టానం సీనియర్‌లను విస్మరించడమేనన్న భావన సీనియర్‌)ను కలిచివేస్తోంది. కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకున్న వారిని కాదని వేరే పార్టీనుంచి కేవలం పదవుల కోసమే వొచ్చిన వారికి ప్రాధాన్యమివ్వచూపడం పట్ల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్‌ ‌నాయకు)ందరిదీ ఒకే భావన అయినప్పటికీ కొందరు మాత్రమే బయట పడ్డారు. వారు చేసిన విమర్శలు అసలే కొడిగట్టిన పార్టీని మరింత కృంగదీసేవిగా ఉన్నాయి.

ప్రధానంగా యువజన కాంగ్రెస్‌ ‌నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపిగా ఎదిగిన సీనియర్‌ ‌నాయకుడు వి హన్మంతరావు ఈ విషయంలో అధిష్టానం మీద నోరుపారేసుకున్నారు. టిపిసిసి అధ్యక్షుడి రేసులో పోటీ పడుతున్న కాంగ్రెస్‌ ‌సీనియర్‌లను కాదని, తెలుగుదేశం పార్టీనుంచి వొచ్చిన రేవంత్‌రెడ్డికి ఈ పదవిని కట్టబెడుతున్నారన్న వార్త ఆయన ఆగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్‌ ‌మొదటి నుంచి భారతీయ జనతాపార్టీని బద్ధ శత్రువుగా భావిస్తూ వొస్తోంది. అలాంటిది ఆ పార్టీ మాతృసంస్థగా పేర్కొనే ఆర్‌ఎస్‌ఎస్‌లో పుట్టి పెరిగిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ ‌పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారన్నది విహెచ్‌ ‌ప్రశ్న. టిడిపి పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తికి తెలంగాణ ఇచ్చిన పార్టీలో పదవులివ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి తానిచ్చిన ఫిర్యాదులను అందకుండా చేశాడని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం టాగూర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన అధిష్టాన నుండి షోకాజ్‌ ‌నోటీసు అందుకోబోతున్నారు. ఈ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా, ఆయనకు అధ్యక్ష పదవిని ఇవ్వని పక్షంలో తీవ్రమైస నిర్ణయం తీసుకుంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

అధ్యక్ష పదవికోసం పోటీ పడుతున్న కోమటి రెడ్డి పార్టీ మారుతాడంటూ అనేక వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే అ పదవిని ఆశిస్తున్న జగ్గారెడ్డి లాంటి మరికొందరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అనుమానాలు లేకపోలేదు. కేంద్రంలోనే పటిష్టపడలేకపోతున్న ఈ పార్టీలో ఇంకా కొనసాగితే తమ భవిష్యత్‌ అం‌ధకారమవుతుందని భావించిన పలువురు సీనియర్‌ ‌నాయకులు పార్టీని వొదిలిపోవడంతో ఇప్పటికే ఆ పార్టీ బలహీనపడింది. ఆ పార్టీలో ఫైర్‌ ‌బ్రాండ్‌గా ఉన్న డికె ఆరుణ, విజయశాంతి, ముఖేష్‌గౌడ్‌, ‌బిక్షపతి యాదవ్‌, అం‌జన్‌కుమార్‌, ‌మాజీ మేయర్‌ ‌కార్తీక్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్‌ ‌లాంటి వారితోపాటు జిల్లా స్థాయి నాయకులనేకులు పార్టీని వీడిపోవడం నిజంగా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే. ఇప్పుడు అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో పార్టీలో అంతర్ఘతంగా కొనసాగుతున్న విభేదాలు మరికొందరు పార్టీని వీడే దిశగా మారుతుండవొచ్చన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే రేవంత్‌రెడ్డి నాయకత్వం కింద పనిచేయడానికి ఇష్టపడని సీనియర్లు అనేకులు పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అవకాశం కోసమే బిజెపి కాచుకుని కూర్చుంది. • •ంగ్రెస్‌ ‌నుండి బయటికి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ శాతం నాయకులు ఆ పార్టీలోనే చేరుతుండడంతో భవిష్యత్‌లో ఇక కాంగ్రెస్‌ అన్నది తెలంగాణలో పూర్తిగా కనుమరగయ్యే ప్రమాదం లేకపోలేదు.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply