Take a fresh look at your lifestyle.

రక్త సంబంధం

ఒకే రక్తమై
రెండు శరీరాలు ఒకే మగ్గమై నేసిన
రంగుల వస్త్రం
రక్త సంబంధం.

ఒక ఊపిరికి
రెండు మనసులల్లిన
అందమైన బంధం
రక్త సంబంధం.

ఇరువురి ఆశకు
మొలిచిన కలకు
కాసిన తీయని నిజం
రక్త సంబంధం.

బ్రతుకు నుదుటిపై
మరో తొలిపొద్దుకు
పలికే స్వాగత గీతం
రక్త సంబంధం.

– చందలూరి నారాయణరావు
9704437247

Leave a Reply