Take a fresh look at your lifestyle.

వొచ్చే ఎన్నికలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదాం

  • బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ ‌దాడులను అడ్డుకోవాలి
  • రైతు, దళిత, నిరుద్యోగ సమస్యలపై విస్తృతంగా ప్రజల్లోకి
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్‌

తెలంగాణ అసెంబ్లీకి జరిగే వొచ్చే ఎన్నికలలో అధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌పిలుపునిచ్చారు. అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలపై జరిపే దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. రెండు రోజుల పాటు జరుగనున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇక్కడి పాతబస్తీ బండ్లగూడలోని మహావీర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కళాశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ • టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. దీనిని బీజేపీ కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.

రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదనీ, దీనిని ప్రశ్నించినందుకు తనతో పాటు పార్టీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ ‌నేతలు దాడులకు దిగారని పేర్కొన్నారు. రైతు, దళిత,నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా ఎదుగుతున్నదనీ, దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో విజయంతో రాష్ట్రంలో బీజేపీ సత్తా ఏమిటో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి చూపించామని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

డిల్లీలో కేసీఆర్‌కు షాక్‌ ‌తగిలింది: తరుణ్‌ ‌చుగ్‌
‌తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డిల్లీలో షాక్‌ ‌తగిలిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నుంచి 25 మంది కీలక నేతలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 80 స్థానాలలో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌నుంచి పోటీ చేయడానికి కేసీఆర్‌కు 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని వ్యాఖ్యానించారు.ఎన్నికలు వస్తే రాష్ట్రంలో తమ పార్టీ సత్తా ఏమిటో చూపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీది ముగిసిన అధ్యాయమనీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దుతో ఒక వర్గం రైతులు మాత్రమే బాధపడ్డారనీ, కొత్త రైతు చట్టాలు అమలు లోకి వస్తే చాలా మందికి లబ్ది కలిగి ఉండేదని ఈ సందర్భంగా తరుణ్‌ ‌చుగ్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply