Take a fresh look at your lifestyle.

దివికేగిన ‘‘విద్వన్నేత్ర’’!

జన్మాంధుడైనా విద్వన్నేత్రాలతో శివ సాక్షాత్కారం పొంది అశేష పాండిత్యంతోవిశేష కృతులు వెలయించిన శివశ్రీ పోతులపాటి సోమశర్మ 2021 జూన్‌ 2 ‌బుధవారంశివసాయుజ్యం చేరుకొన్నరు. నల్లగొండ సమీపంలోని చెరువుగట్టుజడలరామలింగేశ్వర స్వామి అనువంశిక అర్చకుడు లచ్చయ్య లింగమ్మల పెద్ద కుమారుడుసోమశర్మ. 1940 ఫిబ్రవరి 15 బేస్తవారం ప్రమాది సంవత్సరం మాఘ మాసంరథసప్తమి నాడు ఉదయించిన కారణజన్ముడు. తమకు పుట్టినది కనులులేని కొడుకనికలత చెందినా, అధైర్య పడలేదు ఆ తల్లిదండ్రులు. ఊరి బడిలో చేర్పించగాచెవులతో విన్నది మనసులో లగ్నం చేసికొంటూ 5వ తరగతి పూర్తి చేసిండు.పద్యాలు, శ్లోకాలు, అమరకోశం కంఠస్థం చేసిండు. తెలుగు సంస్కృతాలలోపాండిత్యం అబ్బింది. అంధుడైనా జడల రామలింగేశ్వరస్వామికి అర్చకత్వంచేసిండు. స్వామి కటాక్షంతో కవిత్వం వెలువడింది. చెల్లెలు అమృతమ్మ ఆయనకు పాఠకురాలు, లేఖకురాలు. తమ్ముడు రామలింగేశ్వర శర్మ కార్యదర్శి.

జడలరామలింగేశ్వరస్వామి శతకం – సుప్రభాతం, పాలకుర్తి సోమేశ్వరస్వామి శతకం -సుప్రభాతం, శివాష్టోత్తర శతనామావళి, మేధా దక్షిణామూర్తి అష్టోత్తరశతనామావళి, లలితా సహస్ర నామావళి, లలితా అష్టోత్తరం, శివ సహస్ర నామావళికితెలుగు పద్యానువాదాలు చేసిండు. లక్ష్మీగణపతి అష్టోత్తర శతనామావళి, శ్రీహేరంబ గణపతి నవరత్న మాలికా స్తోత్రం, శ్రీ సరస్వతీ మంత్ర మాతృకా స్తోత్రంవ్రాసిండు. మాడుగుల నాగఫణిశర్మ పంచ శతావధానంలో పృచ్చకుడుగా పాల్గొనిప్రశంసలు పొందిండు. ఒక శ్రీరామనవమి నాడు ఊరిలో అష్టావధానాన్నిప్రదర్శించి తనూ అవధానినని నిరూపించుకొన్నడు.

లలితా త్రిశతి నామావళిపద్యానువాదం కూడా పూర్తి చేసిండు. ఆకాశవాణిలో సమస్యా పూరణానికి సోమశర్మగారి పద్యం అనివార్యం. ఆ మహాశయునికి రచనలు తప్ప ప్రచారాలు తెలియవు.సోమశర్మకు పాలకుర్తి సోమనాథ కళాపీఠం, హరద్విజ సూత్ర కర్త దేవగిరి రాజయ్యగారి కుమారుల సౌజన్యంతో, 2012 జూన్‌ 24‌న ‘‘విద్వన్నేత్ర’’ బిరుదు ప్రదానంచేసింది. ఆయన అశీతి పూర్తి సందర్భంగా 2020 జనవరి 22, 23 తేదీలలో మాసశివరాత్రి శుభవేళ ఆదిశైవ పెద్దలు, అభిమానులు భక్తి ప్రపత్తులతో విజయరథశాంతి, సువర్ణ సింహ తలాట సన్మానం జరిపిండ్రు. సోమశర్మ వంటి తెలంగాణతేజాలకు, ప్రతిభామూర్తులకు సవినయ ప్రణామాలు తప్ప ఏమిచ్చుకోగలము.
– డాక్టర్‌ ‌రాపోలు సత్యనారాయణ, 9440163211
ఫోటో: పోతులపాటి సోమశర్మ

Leave a Reply