కొరోనాతో మహారాష్ట్రలోని ప్రఖ్యాత షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఆలయాన్ని ట్రస్ట్ అధికారులు మూసివేయనున్నారు.
భక్తులు షిర్డీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కొరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ముంబయిలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేశారు. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా మూసేశారు.