క్వారంటైన్‌కు వెళ్లిన శిరాజ్ సింగ్ చౌహాన్
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కొరోనా ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కొరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. వైరస్ లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్ అని తేలింది.
నాతో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు టెస్టులు చేయించుకోండి. వారందరూ క్వారంటైన్లోకి వెళ్లిపోండని శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ఆయన ప్రస్తుతం •ం క్వారంటైన్లో ఉన్నారు. సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని చెప్పారు. మన దేశంలో కొరోనా బారినపడ్డ మొదటి సీఎం శివరాజ్‌సింగ్ చౌహానే కావడం విశేషం.