Take a fresh look at your lifestyle.

వేములవాడ రాజన్నకు శఠగోపం

  • కొండగట్టు బాధితులకు పరామర్శ ఏదీ
  • సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : వేములవాడ రాజన్నకు కేసీఆర్‌ ‌శఠగోపం పెట్టాడని మాజీ ఎంపి  పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను కేసీఆర్‌ ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ఆయన నిలదీశారు. అసలు శ్రీరాంసాగర్‌ ‌నీళ్లు మహారాష్ట్రకు ఎలా తీసుకెళ్తారని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.  ఇక కాంగ్రెస్‌లో నాయకులకు సమన్వయం అవసరమని చెప్పారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడొద్దని పొన్నం ప్రభాకర్‌ ‌చెప్పారు. ప్రధాని మోడీ ఓ నియంత అని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అదానీ వ్యవహారంపై మోడీ పార్లమెంట్‌లో మాట్లాడకపోవడం దారుణమన్నారు.

బీబీసీ వి•డియా సంస్థలపై ఐటీ దాడులు చేయడం హేయమైన చర్య అని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న నేతలు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. సందర్భం వొచ్చిన ప్రతిసారి 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కాని కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. కరెంటు తీగలు పట్టుకునేందుకు తాము రెడీగా ఉన్నామని.. దమ్ముంటే వి•రు రెడీగా ఉన్నారా అంటూ జగదీష్‌ ‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు.

Leave a Reply