Take a fresh look at your lifestyle.

లాఠీలకు శతకోటి..!!

ఏం తెలుసు మనకు ?
కరోనా మహమ్మారి
కాటేస్తుందని మనలో
ఎంతమందికి తెలుసు
బయటకొస్తే లాఠీలు
కొడుతున్నాయంటూ
నోరు తెరవడమే తెలుసు
మనం చేసే పొరపాటు
ముందు పెద్దదేమీ కాదే..
కరోనా బారిన పడకుండా
రక్షించడమన్న యావ తప్ప
ఇంకోటి కాదని తెలుసా !
వదిలేస్తే వచ్చే ముప్పుతో
జరిగే పరిణామాలు తెలుసా
బయటికొస్తే కరోనాను
ఇంట్లకి పిలిచినట్లని తెలుసా
మనని కట్టడి చేయకుంటే
ఎవ్వరు వినరనీ తెలుసు
వైరస్‌ ‌కొట్టే  దెబ్బను
తట్టుకోలేరని తెలుసు
సమస్యలొచ్చినా ఓరిమితో
ప్రాణాలను అడ్డు పెట్టి
కరోనాతో ఎదురీదుతూ
అంత్య నిష్టూరం కన్నా
ఆది నిష్టూరం మేలని
సవాళ్ళను అధిగమిస్తూ
జనం సేఫ్‌ ‌బాధ్యతగా
భావించే కవచమే లాఠీ
భద్రతలో లేదు తనకు సాటి
లాక్‌ ‌డౌన్‌ అమలులో మేటి
సహకరిస్తేనే మనం బాధ్యత తోటి
మనసు పెట్టి చెయ్యరా వారి డ్యూటీ
ఇంట్ల ఉండి ఇద్దాము మనం పోటి
కడతేరదా కరోన కడలి దాటి!
సెల్యూట్‌ ‌చేద్దాం మన యెద మీటి
వందనాలు లాఠీలకు శతకోటి!!
– పాల్వంచ హరికిషన్‌,
9502451780

- Advertisement -

Leave a Reply