Take a fresh look at your lifestyle.

చిన్నారి కుటుంబానికి షర్మిల పరామర్శ..అక్కడే దీక్ష•

  • కెసిఆర్‌ ‌ప్రభుత్వం తీరుపై మండిపాటు
  • బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

సైదాబాద్‌ ‌సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రకంపనలు రేగుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. బుధవారం చిన్నారి చైత్ర కుటుంబాన్ని తెలంగాణ వైఎస్సార్‌ ‌పార్టీ అధినేత్రి షర్మిల పరామర్శించారు. సైదాబాద్‌లో అత్యాచారం, హత్యకు గురయిన చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం వైఎస్సార్‌ ‌తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల పరామర్శించారు. బాధతురాలి ఇంటి వద్ద వైఎస్‌ ‌షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు.

సీఎం కేసీఆర్‌ ‌స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు. సీఎం కేసీఆర్‌ ‌హయాంలో మహిళలపై లైంగికదాడులు అధికమయ్యాయని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌వెంటనే స్పందించాలని వైఎస్‌ ‌షర్మిల డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ ‌దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటే…ఇక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారికి పోస్టుమార్టం చేశారని విమర్శించారు. సీఎం ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్‌ ఉద్యోగం తొలగించారని, మరి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు స్పందించరని షర్మిల ప్రశ్నించారు.

ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే చర్యలు తీసుకున్నారు..కానీ ప్రజలు అంటే లెక్కలేదా అని మండిపడ్డారు. 2014లో కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు 938 వేధింపుల కేసులు ఉంటే..అవి 2020కి మూడు రెట్లు అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, ‌మద్యం ఏరులై పారుతుందని..బంగారు తెలంగాణ కాదు.. బార్లు, బీర్ల తెలంగాణ అయిందని మండిపడ్డారు. ఈ ఘటనపై కెసిఆర్‌ ‌స్పందించేంత వరకు నిరాహార దీక్ష కు కూర్చుంటానని స్పష్టం చేశారు.

Leave a Reply