హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వరుస భేటీలు
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్న వైఎస్ షర్మిల.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం బెంగుళూరు నుంచి ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా సోమవారం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి షర్మిలను కలిశారు. వైఎస్ఆర్ హయాంలో, కిరణ్‌కుమార్ రెడ్డి సమయంలో.. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన.. షర్మిలతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక, సమావేశం అనంతరం మిడియాతో మాట్లాడిన రంగారెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశానన్నారు.
షర్మిలపై కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సరికాదని హితవు పలికిన ఆయన.. వైఎస్ చనిపోయినా వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారు. ఇది అభినందనీయం అన్నారు. మహిళలను ప్రోత్సహించాలి, గౌరవించాలన్నారు. ఇక, లక్షలా మంది ప్రజాప్రతినిధులను వైఎస్ తయారు చేశారు.. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డువంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని రంగారెడ్డి గుర్తుచేశారు. వైఎస్ షర్మిలపై ఆవాకులు చెవాకులు మాట్లాడొద్దని మా పార్టీ నేతలకు సూచిస్తున్నాన్న ఈ కాంగ్రెస్ నేత, నిజాయితీ పనులు చేసే వారిని అభినందించాలన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు నాయకులు కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగి.. ఇప్పుడు ఆయన్ని విమర్శించం గొప్ప కాదని మండిపడ్డారు.మరోవైపు పార్టీ ఆవిష్కరణకు రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న షర్మిల పార్టీ ఆవిష్కరణ?. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.గతంలో మే 14న ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మే 14నే పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పాదయాత్ర లకు వెల్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జూలై 8న రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో ఆ రోజును షర్మిల సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.