Take a fresh look at your lifestyle.

లిక్కర్‌ ‌షాపుల్లో వాటా

మద్యం షాపుల్లో 3ం శాతం కోటా
గౌడ్‌15, ఎస్సీ10, ఎస్టీ5 శాతం వాటా

లైసెన్సుల మంజూరులో రిజర్వేషన్‌
‌లిక్కర్‌ ‌బ్యాన్‌ ‌కోరేవాళ్ళలో పరేషాన్‌

‌దీని రాబడి పైననే సర్కారు నడక
లేకుంటే సంక్షేమ పథకాలు పడక

అమ్మకాలతో ఆరోగ్యాలను కొల్లగొట్టు
వచ్చిన రాబడి లో పన్ను చెల్లగొట్టు

తాగుడుతో కుటుంబాలు చితికి పోనీ
మత్తుతో అమానుషాలు జరిగి పోనీ

పాలకులకు కావాల్సింది అధిక ఆదాయం
పట్టించుకోరు జనాలకు కలిగే అపాయం!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply