Take a fresh look at your lifestyle.

శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా

ప్రజా జీవితం నుంచి తప్పుకోవడం లేదని ప్రకటన

రాజీనామా యోచన విరమించుకోవాలని పార్టీ నేతల డిమాండ్‌

‌ముంబై, మే 2 : ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు. మహారాష్ట్రతోపాటు, దేశ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన పవార్‌ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో అంతా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శరద్‌ ‌పవార్‌ ‌తీసుకున్న నిర్ణయంతో పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని, ప్రజా జీవితం నుంచి కాదని ఆయన చెప్పారు. పవార్‌ ‌రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వయసు ద పడుతుండటం, అనారోగ్యం కారణంగానే శరద్‌ ‌పవార్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని తెలుపుతున్నారు. తన కుమార్తె సుప్రీయా సూలేకు అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకే శరద్‌ ‌పవార్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల తన మేనల్లుడు అజత్‌ ‌పవార్‌ ‌బీజేపీలో నలభై మంది

ఎమ్మెల్యేలతో చేరతారన్న వార్తల నేపథ్యంలో శరద్‌ ‌పవార్‌ ఈ ‌ప్రకటన చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. పార్టీ నేతలు మాత్రం రాజీ చేయవద్దంటూ పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అయితే ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నా..తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పవార్‌ ‌డియా సమావేశంలో తెలిపారు. నేను ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నానని శరద్‌ ‌పవార్‌ ‌ప్రకటన చేశారు. దీంతో కార్యకర్తలు శరద్‌ ‌పవార్‌ ‌మద్దతుగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శరద్‌ ‌పవార్‌ ‌రాజీనామాతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి మాత్రమే వైదొలగు తున్నానని.. రాజకీయాల నుంచి తప్పుకోవడంలేదని పవార్‌ ‌స్పష్టం చేశారు. నేను ప్రజాజీవితం నుంచి రిటైర్‌ అవడంలేదు..ఎన్సీపీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని శరద్‌ ‌పవార్‌ అన్నారు.గత కొంతకాలంగా ఎన్సీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవయ్యాయని ప్రచారం జరుగుతోంది.

శరద్‌పవార్‌ ‌సోదరుడి కుమారుడు అజిత్‌ ‌పవార్‌ ‌పార్టీపై తిరుగుబాటు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శరద్‌పవార్‌ ఈ ‌నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. శరద్‌ ‌పవార్‌ ‌రాజీనామాతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని.. పవార్‌ ‌రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ కార్యకర్తలు కోరుతున్నారు. 1999లో పీఏ సంగ్మా, తారీఖ్‌ అన్వర్లతో కలిసి శరద్‌ ‌పవార్‌ ఎన్సీపీ పార్టీ స్థాపించారు. రెండు దశాబ్దాలుగా ఎన్సీపీని ముందుండి నడిపిస్తున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఆటోపోటులను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించారు. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడి కూటమిలో శరద్‌పవార్‌ ‌కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన పార్టీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడంతో ఎంవీఏ కూటమి భవిష్యత్‌ ‌గందరళగోళంలో పడింది. మరోవైపు బీజేపీపై పోరాటంలో విపక్షాలను ఒకే తాటి దకు తెచ్చేందుకు పవార్‌ ఎం‌తో కృషి చేస్తున్నారు. ఇలాంటి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పు కోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Leave a Reply