Take a fresh look at your lifestyle.

దళిత సర్పంచ్‌కు అవమానం

  • దేవాలయంలోకి రానివ్వని వారిపై
  • చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

గ్రామ సర్పంచ్‌ ‌దళితురాలు కావడంతో జిల్లా కలెక్టర్‌ ‌సాక్షిగా కలెక్టర్‌ను ఆలయంలోకి ఆహ్వానించి యాదవ సంఘ నాయకులు సర్పంచ్‌ను ఆలయంలోకి రావద్దని ఆపివేసిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో గల హరిదాస్‌నగర్‌ ‌గ్రామంలో సోమవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలుసుకున్న మాల సంక్షేమ సంఘ జిల్లా నాయకులు బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్‌కుమార్‌ ‌మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌ ‌సోమవారం హరిదాస్‌నగర్‌ ‌గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆ గ్రామంలో యాదవ కులస్థులు వారి కులదైవమైన మల్లన్న దేవాలయం దగ్గరికి కలెక్టర్‌తో సాహ అందిరిని ఆహ్వనించారు. అక్కడికి వెళ్లిన వారందిరితో గ్రామ సర్పంచ్‌ ‌తెడ్డు అమృత కూడా వెళ్లగా యాదవ కులస్థులు దళిత మహిల అవడ్డంతో ఆమెను దేవాలయంలోకి రావద్దని నేరుగా చెప్పడం జరిగింది. పల్లె నిద్రలో పాల్గొన్న వారందరు దేవాలయంలోకి వెళ్లగా గ్రామ అధినేత అయిన ఫోటోకాల్‌ ‌ప్రకారం సర్పంచ్‌ ‌వెళ్లవల్సి ఉండగా కనీసం కలెక్టర్‌, ‌ప్రజాప్రతినిధులు, అధికారులు సర్పంచ్‌ను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ‌సమక్షంలోనే ఇద్దంత జరిగిన కూడా ఇంతవరకు కలెక్టర్‌ ‌స్పందించకపోవడం చాల బాధకరమన్నారు. ఇలాంటి కులవివక్షత మళ్లి జరుగకుండా చూడవల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌దే అని అన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్‌ ‌స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాల సంఘ జిల్లా అధ్యక్షుడు రోడ్డు రాంచంద్రం, మాజీ ఎంపిటిసి భగవంతం, మంత్రార్తి శ్రీనివాస్‌, అం‌బటి రవికుమార్‌లు పాల్గొన్నారు.

Leave a Reply