Take a fresh look at your lifestyle.

ఆపన్న హస్తం చాచుదాం..! కరోనాను ఎదుర్కొందాం..!

  • చేయి చేయి కలిపి కరోనా ప్రభావాన్ని అంతమొoదిద్దాం
  • పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 
 కరోనా ప్రభావంతో నిరుపేదల జీవనమే కష్టతరంగా మారుతున్న ఈ పరిస్థితులలో మీకు మీమున్నామంటూ పలువురు మానవతా మూర్తుల సాయం సర్వత్రా ప్రశంశలు పొందుతున్నది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు పేదలను ఆదుకునేందుకు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జిల్లాలోని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారని., ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ మేరకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త దుండిగల బాల్ రాజేశం రూ.5లక్షలు, జువ్వన మల్లేశం రూ.1లక్ష రూపాయలు, మాధవనేని రామారావు రూ.1లక్ష రూపాయలు, మాజీ ఏఏంసీ చైర్మన్ వేముల వెంకట్ రెడ్డి రూ.1లక్ష రూపాయలు, చిన్నకోడూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరపున రూ.10వేలు విరాళాలు ప్రకటించారు.

Leave a Reply