Take a fresh look at your lifestyle.

‘‘‌నింగికెగిసిన వేగుచుక్కలు’’ ( షాహిద్‌ ‌దివస్‌ ‌సందర్భం)

‘‘ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌’’ ‌విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్య్రం సిద్దిస్తుందని నమ్మిన తొలితరం విప్లవ కారులు…
జీవితాన్ని ప్రేమిస్తాం,
మరణాన్ని ప్రేమిస్తాం
మేము మరణించి
ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం…
ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం
అంటూ భరతమాత దాస్యశృంఖలాలు విడిపించడానికి అసమానపోరాటం చేసి వారు, 23 ఏళ్లకే ఉరికొయ్య ను ముద్దాడిన విప్లవ వీరులు. దేశం కోసం ముగ్గురు యోధులు బలిదానం చేసిన రోజు. చరిత్ర నొసటిపై వారు నెత్తుటి సంతకాలు.. సర్దార్‌ ‌సాహిద్‌ ‌భగత్‌ ‌సింగ్‌., ‌శివ రామ్‌ ‌రాజ్‌ ‌గురు, సుఖదేవ్‌ ‌తాఫర్‌. అమరత్వం పొందిన రోజు 1931 మార్చి 23, దేశం కోసం త్యాగం చేయాలని, పట్టుదల గల కుటుంబం లో జన్మించారు భగత్‌ ‌సింగ్‌ అతని అనుచరులు. భగత్‌ ‌సింగ్‌ ‌పూర్వపు పంజాబ్‌ ఇప్పటి పాకిస్తాన్‌ ‌లాయల్‌ ‌జిల్లా బంగా సమీపం ఖట్కర్‌ ‌కాలానులో సర్దార్‌ ‌కిషన్‌ ‌సింగ్‌, ‌విద్యావతి దంపతులకు సెప్టెంబర్‌ 28, 1907 ‌న జన్మించారు. భగత్‌ అనే పదానికి భక్తుడు అని అర్థం. భవిష్యత్తుకు బాల్యమే మొలక. పిన్నవయసులో తుపాకులు ఎక్కుపెట్టి పరాయి పాలన నుండి విముక్తి కలిగించాలనే . 1919 లోజలియన్‌ ‌వాలాబాగ్‌ ‌మారణకాండతో చలించి, 12 ఏళ్ల వయసులోనే అక్కడికివెళ్ళి అమరుల రక్తంతో తడిసి ముద్దైన మట్టిని నొసటితో స్పృశించి, పిడికెడు మట్టి ని తీసుకువచ్చి రోజూ పూజించేవాడు. భగత్‌ 14 ఏళ్ల వయసులోనే స్కూల్‌ ‌మాని ఉద్యమ రంగంలోకి దూకాడు. సచింద్రనాథ్‌ ‌సన్యాల్‌ ‌స్థాపించిన హిందుస్థాన్‌ ‌రిపబ్లికన్‌ అసోసియేషన్‌ ‌సంస్థలో చేరాడు.

హరి శివ రామ్‌ ‌రాజ్‌ ‌గురు మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1980 ఆగస్టు 24న పార్వతిదేవి, హరినారాయణ రాజ్‌ ‌గురు దంపతులకు పూణె సమీపంలోని ఖేద్‌ ‌లో జన్మించారు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్య, పూర్తి చేసి తర్వాత పూనాలోని న్యూ ఇంగ్లీష్‌ ‌హై స్కూల్‌ ‌లో విద్యాభ్యాసం పూర్తిచేసాడు. మరో సహచరుడు సుఖదేవ్‌ ‌తాపర్‌ ‌పంజాబీ వాల్మీకి కుటుంబంలో .రల్లిదేవి, రామ్‌ ‌లాల థాపర్‌ ‌దంపతులకు లూథియానా వద్ద 15 మే 1907 న జన్మించారు. సుఖ్‌ ‌దేవ్‌ ‌కూడా హిందుస్థాన్‌ ‌సోషలిస్ట్ ‌రిపబ్లికన్‌ అసోసియేషన్‌ ‌లో చురుకైన కార్యకర్త. పంజాబ్‌ ఉత్తర భారత దేశంలో విప్లవాత్మక కార్యచ్రమాలు కొనసాగించాడు.

ఎలాగైనా భారతదేశానికి స్వతంత్రం తేవాలన్న లక్ష్యంతో యువతను చైతన్య పరచే వారు. భగత్‌ ‌సింగ్‌ ‌యుక్తవయస్సులోనే అమృత్‌ ‌సర్‌ ‌నుంచి వెలువడే ఉర్దూ పంజాబీ వార్తాపత్రికకు వార్తలు రాసేవాడు. సంస్థ ప్రధాన నాయకులను బ్రిటిష్‌ ‌వారు ఉరి తీసిన కారణంగా భగత్‌ ‌సింగ్‌ ‌సహచర విప్లవకారులు చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌సుబ్బు దేవ్‌ ‌టాపర్‌, ‌రాజ్‌ ‌గురులతో కలిసి పని చేశారు. 1928లో భారత్‌ ‌రాజకీయ పరిస్థితులపై నివేదిక కోసం సర్‌ ‌జాన్‌ ‌సైమన్‌ ‌కమిషన్‌ ‌నియమించింది. ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో భారతదేశంలోని రాజకీయ పార్టీలు కమిషన్‌ ‌బహిష్కరించి నిరసన వెలిబుచ్చాయి.

1928 అక్టోబర్‌ 30 ‌కమిషన్‌ ‌లాహోర్‌ ‌సందర్శించి నప్పుడు సైమన్‌ ‌కమిషన్‌ ‌ను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ‌కేసరి లాలాలజపతిరాయ్‌ ఆధ్వర్యంలో నిశ్శబ్ద నిరసన కార్యక్రమం చేపట్టగా అయితే తెల్లపోలీసులు లజపతిరాయ్‌ ‌ఛాతిపై లాఠీఛార్జి చేయడంతో తీవ్రంగా గాయపడి, కొద్దిరోజుల తర్వాత మరణించడం భగత్‌ ‌లో ప్రతీకార భావంపెరిగింది. సహచర విప్లవకారులు రాజ్‌ ‌గురు, సుఖదేవ్‌, ‌జై గోపాల్‌ ‌చేతులు కలిపి లజపతిరాయ్‌ ‌మరణానికి కారకుడైన స్కాట్‌ ‌ను చంపాలని నిర్ణయించారు. స్కాట్‌ ‌బదులు పొర పాటున జేపీ సాండర్స్ ‌ను హతుడు అయ్యాడు. దీంతో పోలీసులకు దొరకకుండా భగత్‌ ‌సిక్కు మత విశ్వాసాలను వదిలి మారువేషంలో తప్పించుకుని తిరిగాడు.

భారత విప్లవకారులను అణచి వేయడానికి భారత రక్షణ చట్టం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ, కేంద్ర శాసన సభ పై బాంబులు వేయడానికి హిందుస్థాన్‌ ‌సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. భగత్‌ , ‌బట్‌ ‌కేశ్వర్‌ ‌దత్‌ అసెంబ్లీ ఆవరణలో బాంబు దాడి చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్త పడి అక్కడే లొంగిపోయారు. సాండర్స్ ‌హత్య వెనక భగత్సింగ్‌ ‌ప్రమేయాన్ని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆరా తీసి భగత్‌ ‌సింగ్‌ ,‌రాజ్‌ ‌గురు ,సుఖ్‌ ‌దేవ్‌ ‌పై హత్య అభియోగాలు మోపింది. విచారణ సమయంలోనే బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా గొంతెత్పారు. బ్రిటిష్‌ ‌జైలు గోడల మధ్య కూడా అన్యాయ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు ఉరి శిక్షను విధించి మార్చి 24 1931 ఉదయం ఎనిమిది గంటలకు ఉరి అమలవుతుందని ప్రకటించి, మార్చి 23 1931 రాత్రి 7 గంటలకు ఉరి తీశారు. ఉరి తీసే ముందు ముగ్గురు వీర యోధులు ఒకరినొకరు హత్తుకొని ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌ అం‌టూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసారు.

యువతకు భగత్‌ ‌సింగ్‌ ‌రాజ్‌ ‌గురు సుఖ్‌ ‌దేవ్‌ అం‌దించిన స్ఫూర్తి గురించి పరిశీలిస్తే.. యవ్వనం మానవ జీవితానికి వసంత రుతువు. యవ్వన ప్రాదుర్భావంతో మనిషి మత్తెక్కి వెయ్యి సీసాల మధువు తాగినంత మత్తు ఆవహిస్తుంది. యవ్వనంలో రెండే రెండు మార్గాలు ఉంటాయట. ఉన్నత శిఖరాన్ని అధిరోహించడం, అధః పాతాళ కందకంలో పడిపోవడం. త్యాగి అవుతాడు లేదా భోగి గా మారతాడు.. కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నేటి యువత యువకులు భగత్‌ ‌సింగ్‌, ‌రాజ్‌ ‌గురు, సుఖ్‌ ‌దేవ్‌ ‌వారసత్వాన్ని అందిపుచ్చుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయడమే వారికి మనమిచ్చే నివాళి……

tanda sadhananda
తండా సదానందం, మహబూబాబాద్‌ ‌జిల్లా.

Leave a Reply