Take a fresh look at your lifestyle.

షాహీన్‌ ‌బాగ్‌ ‌మహిళలు భావితరాలకు స్ఫూర్తి

షాహీన్‌ ‌బాగ్‌ ‌మహిళలు పాతకాలపు ఆచారాలను తుడిచి పెట్టారు. అణచివేతకు గురవుతున్న ముస్లిం మహిళలను ఎవరో రక్షించాలనే నమ్మకాన్ని తుడిచి పెట్టారు. వారే దేశాన్ని కాపాడేందుకు అడుగు ముందుకువేశారు,  తమ పిల్లలను నిరసనలకు ఈ మహిళలు తీసుకుని రాకూడదన్న విమర్శలు వచ్చాయి. వాటిని వారు లెక్క చేయలేదు.

  • విప్లవాలు లేకపోతే మహిళలకు విముక్తి లేదు  అలాగే, మహిళలు లేనిదే విప్లవాలు లేవు..
 ప్రముఖ మహిళా  హక్కుల ఉద్యమ నాయకురాలు వసంత కన్నాభిరాన్‌ ‌భారత దేశంలో మహిళా ఉద్యమాలను, తన భాగస్వామ్యాన్ని ఒక పుస్తకంలో విపులీకరించారు.ఈ ఉద్యమం  ద్వారా ప్రయోజనం పొందిన విజయగాథలను కూడా ఆమె వివరించారు.ఎన్నో విశ్లేషణలు కూడా ఆ పుస్తకంలో పొందుపర్చారు. షాహీన్‌ ‌బాగ్‌  ‌మహిళలు దేశాన్ని రక్షించడం కోసం ఉద్యమించారు. మన స్వాతంత్య్రాలను కాపాడారు.  భవిష్యత్‌ను పునర్నించారని వసంత కన్నభిరాన్‌ ‌పేర్కొన్నారు. వసంత కన్నభిరాన్‌  ‌గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని ఆమె ఇంటికి వెళ్ళాను,.  ఆమె  కలంకారీ చీరె ధరించారు.,  చాలా నిరాడంబరంగా ఉన్నారు. భారత దేశంలో మహిళా ఉద్యమంలో కన్నభిరాన్‌కు మంచి పేరు ఉంది.  ఆమె ఇంట్లో   ఒక ఫోటో గోడకు వేలాడుతోంది.  గుత్తికొండ బిలం లో ఆ ఫోటో తీశారు.  ఆ సంఘటన గురించి ఆమె  వివరించారు.  ఆమె నన్ను నవ్వుతూ,సాదరంగా ఆహ్వానించారు.  వసంత కన్నభిరన్‌ ‌హక్కుల  సంఘాలను ప్రోత్సహించారు.  భారత ఆధునిక మహిళా ఉద్యమాల్లో    అవి ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.  పౌరసమాజం  జరిపిన పోరాటాలను గురించి ఆమె వివరించారు.  ఆమె రాసిన పుస్తకంలో పీడనకు గురైన వారి అనుభవాలు,  హక్కుల ఉద్యమం ద్వారా సాధించిన విజయాలను గురించి వివరించారు.
image.png

మొదటి ఫెమినిస్ట్  ‌యాక్షన్‌..
‌మహిళల హక్కుల కోసం పోరాటంలో ఆమె జీవితంలో  చాలా కాలం తర్వాతే   ప్రవేశింశారు.  అయితే, అందుకు సంబంధించిన సంకేతాలు  ముందే  ఆమెలో ప్రవేశించాయి. ధోబీకి వేసే బట్టల జాబితా  అంటే చాకలి పద్దు రాయడం మహిళల బాధ్యతే అనే సరికి ఆమెకు  చిర్రెత్తింది, అక్కడి నుంచి కాలేజీల్లోనూ  సమాజంలో అన్నింటిలోనూ ఆమెకు పురుషాధిక్యత కనిపించింది,   కాలేజీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  మహిళలకు కూడా ఒక పదవి ఉండాలనే భావన వచ్చింది  ప్రోటోకాల్స్ ‌ను ఉల్లంఘిస్తూ  ఆమె, ఆమె స్నేహితురాళ్ళు కొందరు అధ్యక్ష పదవికి ఒక మహిళ పేరు ప్రతిపాదించారు.   ఇది కేవలం ఒక ప్రతిచర్య ..స్వచ్ఛమైనది, చాలా  చిన్నది.  షాహీన్‌బాగ్‌ ‌ఘటన ముస్లిం మహిళల నమ్మకాన్ని చెదరగొట్టింది.  వసంత  చెప్పిన మాటలు వారు తెలుసుకోవాలి. అదేమంటే విప్లవాలు లేకపోతే మహిళలకు విముక్తి లేదు  అలాగే, మహిళలు లేనిదే విప్లవాలు లేవు అని ఆమె తన  పుస్తకంలో రాశారు.  వారి చర్యలు   వారాల తరబడి వేధింపులకు దారి తీశాయి. అశ్లీలమైన ఫోటోలతో వేధించారు.

కాలేజీ పాలనాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  దాంతో కాలేజీలో మహిళలు తిరగబడ్డారు.  అక్కడ జరిగిన కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు.  వారు అలా  హెచ్చరించడం కమ్యూనిస్టు   వార సత్వానికి  ప్రతీక అంటారు వసంత కన్నభిరాన్‌  ‌నేను  ఈ విషయాన్ని గురించి ఇంట్లో ఎప్పుడూ చర్చించలేదు, అసలు ప్రస్తా వించలేదు అని అన్నారు.   ఇది  ఫెమినిస్ట్,  ‌తెలివైనది అని  హిండ్‌ ‌సైట్‌ ‌చెప్పారు.  ఆమె తన జీవితంలో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.. 1980లో హైదరాబాద్‌లో మతకలహాల సమయంలో  హైద రాబాద్‌ ఏక్తా   కార్యక్రమంలోనూ,  అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సహాయకార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  ఇలాంటి జ్ఞాపకా లెన్నింటినో  ఆమె గ్రంథస్థం చేశారు.  నేను నా కథనే చెబు తున్నాను   పాఠకు లకు మాత్రం ఈ రోజు అదే ప్రతి ధ్వనిస్తోంది.
మహిళల్లో ఆత్మవి శ్వాసం ఎక్కడి నుంచి వస్త్తుంది. అది మనమే  పెంచుకోవాలి,  లేదా మహిళా ఉద్యమాల నుంచి పెంచుకోవాలి.  ఆమె తన పుస్తకంలో సుదీర్ఘమైన అనుభవాలను వివరించారు.  మహిళలు  ఎవరో సాయం చేస్తారని ఆశించకుండా తమకు తామే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలని రాశారు.  తమ కోర్కెలను సాధించడానికి,   కష్టాలను తొలగించుకోవడానికి తమకు తామే మార్గాన్వేషణ చేసుకుంటూ సాగాలని ఆమె రాశారు. అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మహిళలు వీధుల్లోకి రావడం కొత్త కాదు. స్వాతంత్య్రోద్యమంలో అచ్చమాంబ, దుర్గాబాయ్‌ ‌వంటి  ధీర వనితలు   ఆందోళనలు నిర్వహించారు. ఉద్యమాలు నిర్వహించారు.  వారి నుంచి మహిళలు స్ఫూర్తి పొందాలి. విప్లవాలు లేనిదే మహిళా విముక్తి లేదని ఆమె రాశారు.  అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో రమీజాబి  సామూహిక అత్యాచారం  ఘటనపై మహిళలు జరిపిన నిరవధిక పోరాటంతో ప్రభుత్వం గద్దె దిగింది. కాశ్మీర్‌లో మహిళలు ఎన్నో దాడులను ఎదుర్కొని  పోరాటాలు జరిపారు. నేషనల్‌  ‌రిజిస్టర్‌ ఆఫ్‌• ‌సిటిజెన్స్, ‌పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటాల్లో మహిళలు పాల్గొంటున్నారు.
షాహీన్‌ ‌బాగ్‌ ‌మహిళలు పాతకాలపు ఆచారాలను తుడిచి పెట్టారు.
అణచివేతకు గురవుతున్న ముస్లిం మహిళలను ఎవరో రక్షించాలనే నమ్మకాన్ని తుడిచిపెట్టారు. వారే   దేశాన్ని కాపాడేందుకు అడుగు ముందుకువేశారు,  తమ పిల్లలను నిరసనలకు ఈ మహిళలు తీసుకుని రాకూడదన్న   విమర్శలు వచ్చాయి.  వాటిని వారు లెక్క చేయలేదు. మంచి తల్లులుగా మిగిలి పోవాలను కుంటున్నారో,  సామాజిక న్యాయ కోసం పోరాడే ధీరలు కావాలనుకుంటున్నారో ఎంచుకోండి మహిళలు  అవసరమైన ప్పుడు తమ శక్తి సామర్ధ్యాలను ధీర త్వాన్ని రుజువు చేసుకున్న సంఘ టనలు చరిత్రలో ఉన్నాయి  వసంత కన్నభిరాన్‌ ‌పుస్తకంలో మహిళా పోరాటాల గురించి సవివరంగా ప్రస్తా వించడం జరిగింది.  మహిళలపై లైంగిక  దాడులకు వ్యతిరేకంగానూ, సామాజిక న్యాయం కోసం వసంత ఇప్పటికీ పోరాడుతున్నారు.  ఫెమినిస్టుల పోరాటానికి ఇది గొప్ప దిక్సూచి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి,. ముఖ్యంగా మహిళలు చదివితే జీవితంలో అడ్డంకులు, దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది.

Leave a Reply