కోవిడ్ 19 మహమ్మారి సమయంలో లైంగిక ఆనందం (sexual pleasure in times of Covid-19)
ప్రస్తుతం కరోన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ప్రతి ఒక్కరిలో తెలియని ఒక ఆందోళన వెంటా డుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సెల్ఫ్ లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. కొంత మంది దంపతులలు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శృంగారం లో తెలియాడుతూ ఉన్నారు. భయాలు, ఆందోళనలు, కుటుంబ ఒత్తిళ్ళు మరి కొంతమంది కుటుంబ జీవితాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది, దంపతులల మధ్య లైంగిక ఆసక్తి తగ్గుతోంది.
ఆధునిక జీవన విధానంలో యంత్రాలతోటే రోజంతా గడిచిపోతుంది. ఆర్థికంగా అందరికంటే ఎక్కువ ఎత్తులో ఉండాలని, ఉరుకుల పరుగులతో పరుగులు తీస్తున్నా మనుషులకు సెక్సు పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రస్తుత కాలంలో భార్య, భర్తల మధ్య స్పర్శ, మాటా ముచ్చటకు, శృంగారమునకు నోచుకోని కుటుంబాల సంఖ్య నానాటికి పెరిగిపొతున్నాయి. ఆ మధురానుభూతిని, ప్రేమాను రాగాలను, అప్యాయతను పొందలేక మానసిక సమస్యలతో జీవితాన్ని పాడు చేసుకొంటున్నారు.
వరల్డ్ అసోసియేషన్ ఫర్ సెక్సువల్ హెల్త్ లైంగిక ఆరోగ్యం పై సామాజిక అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 4 నాడు వరల్డ్ సెక్సువల్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కోవిడ్ 19 మహమ్మారి సమయంలో లైంగిక ఆనందం (•వఞ••శ్రీ జూశ్రీవ•••తీవ ఱఅ •ఱఎవ• శీ• •శీఙఱ•-19) 2020 అనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది.
సృష్టికి మూలం: నిజానికి సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. అసలు ఇదే సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంతటి పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది.సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సంసార జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే భవిష్యత్తు బంగారు మయం అవుతుంది.
మనసు విప్పి మాట్లాడుకోవాలి: భార్యభర్తలకి ఎలాంటిదయిన సమస్య వచ్చిన, గోడ వపెట్టుకున్నప్పటికి సమస్య ఎలాంటిదయినా సరే మనసు విప్పి మాట్లాడుకోవాలి.అప్పుడే సమస్యలు సద్దుమణుగుతాయి. మనుసువిప్పి మాట్లాడుకోవడం వల్ల దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆలుమగల మధ్య ఇద్దరిలో ఏవో లోపాలు ఉంటాయి. దంపతులలో ఒకరిలో లోపాల్ని మరొకరు ఎత్తి చూపుతుంటారు.ఎదుటి వారి స్థానంలో ఉండి మనం ఆలోచించగలిగితే ఆ సమస్యలకు చెక్ పేట్టోచ్చు . భాగస్వామిలోని సానుకూలతల్ని గుర్తిస్తే ఆలుమగలు సంతోషంగా జీవించవచ్చు.
దాంపత్య జీవితమే మధురం: భరించేవాడు భర్త అయితే, బాధలను పంచుకునేది భార్య. కష్ట సుఖాలలో భర్త అడుగు జాడల్లో నడుస్తూ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ కలిసి ప్రయాణం చేయాలి. ఇదే క్రమంలో ఎన్నో రకాల ఒడి దుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాంపత్య బంధం సాఫీగా కొనసాగాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. దాపరికాలు, పక్క చూపు, అసంతృప్తి లేని బంధమే దంపతుల మధ్య కలకాలం సంతోషంగా ఉంటుంది. వీటిలో ఏది లోపించినా ఆప్యాయతకు, అనుబంధానికి ముప్పు వాటిల్లుతుంది. దాంపత్య జీవితంలో కలకలం రేగుతోంది. దాంపత్య జీవితమే మధురం అని గుర్తించాలి.
శృంగారం రెండు మనసుల సంగమం: శృంగారం అనేది రెండు మనసులతో పెనవేసుకున్న బంధం.
సంబంధించినదే కాని శారీరక ప్రక్తియ కాదని సమాజంలోని వ్యక్తులు గుర్తించాలి. లైంగిక ఆరోగ్యం అంటే భౌతిక, భావోద్వేగ, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క లైంగికతకు సంబంధించినది. సాంఘికంగా, సామాజికంగా ఆమోదించిన లైంగికత మరియు లైంగిక సంబంధాలను మాత్రమే కొనసాగించడం లైంగిక ఆరోగ్యానికి సురక్షితం. ఆహ్లాదకరమైన మరియు సురక్షితమైన లైంగిక అనుభవాలు మాత్రమే బలహీనత, వివక్ష మరియు హింస లేనకుండా ఉండే అవకాశం ఉంటుంది. సమాజంలోని అందరి లైంగిక హక్కులు గౌరవించబడాలి, రక్షణ ఉన్నప్పుడు మాత్రమే లైంగిక ఆరోగ్యం సాధించటం సులువు అవుతుంది.
యవ్వన దశలో కలిగే మానసిక ఒత్తిళ్లు : బాల్యదశ నుంచి యవ్వన దశలో ఎదిగే క్రమంలో కలిగే శారీరకంగా మార్పులు జరిగే క్రమంలో మానసిక ఒత్తిళ్లకు తల్లి దండ్రుల అవసరం మరింత పెరుగుతుంది. యవ్వన దశలో శారీరకంగా కలిగే మార్పులు, హార్మోన్స్ లలో కలిగే మార్పులతో, మానసికంగా తలెత్తే ఎమోషన్స్ ను పంచుకోవడానికి తల్లిదండ్రుల సహాకారం చాలా అవసరమై ఉంటుంది. అనవసర భయాలు: సెక్సు పట్ల పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులలో అనవసర భయాలు చోటు చేసుకుంటున్నాయి. వీరికి సెక్సు పట్ల అవగాహన కల్పించేవారు కూడ కరువయ్యారు. స్నేహితులు, పుస్తక పఠనం ద్వారా అసంపూర్తిగా తెలుసుకున్న సెక్సు పరిజ్ఞానం తో అనవసరభయాలతో డిప్రెషన్ లోకి వెల్లుతున్నారు.
ప్రీ మారిటల్ కౌన్సెలింగ్: ఎన్ని డిగ్రీలు పూర్తి చేసిన లైంగిక విద్యపై అవగాహన ఉండక పోవచ్చు. వివాహానికి ముందుగానే కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా వివాహం చేసుకున్న తర్వాత దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ ద్వారా సెక్స్ , కొత్తగా పెనవేసుకున్న బంధాలను మరింత బలపడటానికి దంపతులు ఎలాగో ఉండాలో తెలుస్తుంది.
తగాదాలతో సెక్సుకు దూరం: దాంపత్య జీవితంలో కోపం, శాంతం, దు:ఖం, సంతోషం, అలక, ఓదార్పు, చిరాకు, విసుగు,ఉత్సాహం ఇలాంటివి అన్ని కలగలుపుగా అనుభవాలుగానే ఉండాలి. ఇవన్నీ దాంపత్యంలో శృంగార ప్రేరకాలుగా ఉండాలే తప్ప వాటి పరిధికి మించి ఎక్కువైనపుడు, హద్దులు దాటినపుడు సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడూ ఒక్కరిదే పై చేయిగా ఉండాలని కోరుకోవడం మూర?త్వం అవుతుంది. చిన్న చిన్న మనస్పర్థలను పెద్దవిగా చేసుకోకూడదు. పాజిటివ్ దృక్పథం వైపుగా ఆలోచించాలి. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలంటే ఇరువురి మధ్య సర్దుబాటు తప్పనిసరిగా ఉండాలి.
గుడ్ టచ్ బాడ్ టచ్ లపై అవగాహన ఉండాలి: శారీరక అవసరాలైన ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్ అనేది కూడా అలాంటిదే. సమాజంలోని వ్యక్తులు, యుక్త వయసుకు వచ్చిన ఆడ, మగ పిల్లలకు సెక్సు పట్ల అవగాహన, గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లైంగిక విద్య పై అవగాహన భారత చట్టం యొక్క పరిమితులకు లోబడి, పరిధికిలోబడి మాత్రమే ఉండాలి. గుడ్ టచ్ బాడ్ టచ్ లపై అవగాహన కలిగించే వారు ప్రస్తుత కుటుంబ వ్యవస్థలో కరువయ్యారు. అందుకే చిన్న పిల్లలు, ఆడ పిల్లలు సులభంగా మృగాల చేతిలో బడి మోసపోతున్నారు, అత్యచారాలకు గురవుతున్నారు.
శృంగారం తో మానసిక ఒత్తిడి దూరం: ఆధునిక జీవన విధానంతో మనుషులలో ఒత్తిడి పెరుగుతోంది. భార్యా భర్తల మధ్య ఒక వైపు ఉద్యోగ జీవితం, మరో వైపు కుటుంబ బాగోగులను బాలన్సు చేసుకోవడానికి మనిషి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. భార్య, భర్తల ఇరువురి మధ్య శృంగారంతొ , సెక్సు తో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఆనందమయ జీవితానికి బాటలు వేసుకోవచ్చు.
దంపతుల లైంగిక జీవితం సాఫీగా ఉండాలంటే: భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు. శృంగారంలో భార్యాభర్తలిద్దరు ఒకరినొకరు సహకరించుకోవాలి. సమస్యలు పడక గది వరకే పరిమితం కావాలి. భార్యభర్తలు ఇరువురు కష్ట సుఖాలను సమంగా పంచుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు అతిగా స్పందించవద్దు. సర్దుబాటు అనేది తప్పనిసరి.

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321