Take a fresh look at your lifestyle.

జంట హత్యల కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు

Crime

  • భూ తగాదాల హత్య కేసులో సంచలన తీర్పునిచ్చిన జిల్లా జడ్జి ఎం.వి. రమేష్

కనగల్ మండల పరిధిలోని కురంపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో జరిగిన జంట హత్యల కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు, నిందితులందరికి కలిపి లక్షా 80 వేల రూపాయల జరిమాన విధిస్తూ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి ఎం.వి. రమేష్ బాబు మంగళవారం తీర్పు వెలువరించారు.

కేసు వివరాలను పరిశీలిస్తే కురంపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 937, 938లలో 11.00 ఎకరాల వ్యవసాయ భూమిని దాసరి యాదయ్య సాగు చేయడంతో పాటు అతని పొలానికి పక్కనే ఉన్న దోటి మణెమ్మకు చెందిన 2.25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భర్తతో సంబంధం లేకుండా వేరుగా ఉంటున్న దోటి మణెమ్మ భర్త అయిలయ్య తనకు తెలియకుండా భూమి విక్రయించడం, దాసరి యాదయ్య కొనుగోలు చేయడంతో అట్టి భూమిని ఎలాగైనా తమ స్వంతం చేసుకోవాలని దోటి పాండరయ్య అతని కుమారులు అయిలయ్య, మల్లేష్, దోటి వెంకటేశంతో పాటు వెంకటేశం కుమారులు సైదులు, కిరణ్, భరత్ లు పథకం ప్రకారం 21 ఆగస్టు 2017 రోజున దాసరి యాదయ్య కుమారులైన ఆంజనేయులు, అన్నమయ్యలను కర్రలు, గొడ్డళ్లతో నరికి చంపారు. దాసరి యాదయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కనగల్ పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా జిల్లా న్యాయమూర్తి ఎం.వి. రమేష్ నిందితులకు జీవిత ఖైదుతో పాటు 1,80,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

కేసులో ప్రభుత్వం తరఫున అదనపు పిపి జవహార్ లాల్ వాదించగా, విచారణాధికారిగా అప్పటి సిఐ పి. రమేష్ వ్యవహరించగా విచారణ సమయంలో సిఐ రవీందర్, ప్రస్తుత సిఐ సురేష్ కుమార్, ప్రస్తుత కనగల్ ఎస్.ఐ. సతీష్ రెడ్డి, కోర్టు లైజన్ అధికారి వి. శ్రీనివాస్, అసిస్టెంట్ లైజన్ అధికారి నరేందర్, కోర్టు డ్యూటీ అధికారి కె.రమేష్ బాబు తదితరులు సహకరించారు.

Leave a Reply