Take a fresh look at your lifestyle.

వ్యాపారుల సౌకర్యార్థం మార్కెట్ల ఏర్పాటు: మేయర్‌

  • మాంసం మార్కెట్‌ను ప్రారంభించిన మేయర్‌, ‌ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌
  • ‌వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్‌లో హరితహారం

వ్యాపారుల సౌకర్యార్థం మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా మేయర్‌ ‌గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. మహానగర పాలక సంస్థ ఖాజీపేట,జూబ్లీ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మాంసం మార్కెట్‌ను బుధవారం మేయర్‌, ‌ప్రభుత్వ చీఫ్‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌లు సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సంద ర్భంగా చీఫ్‌విప్‌ ‌మాట్లాడుతూ చరిత్రాత్మక నగరానికి కాజీపేట ముఖద్వారం లాంటిదని,రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ల నిర్మాణాలకి ప్రత్యేక శ్రద్ధ చూపుతు న్నారని, కాజీపేట ప్రాంతంలో నిజాం కాలం నాటి వంద సంవత్సరాల క్రితం నిర్మించిన మార్కెట్‌ ఉం‌డడం వల్ల, అన్ని రకాల సదుపాయాలతో సుమారు రూ.30 లక్షల అంచనా వ్యయంతో మార్కెట్‌ ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. సుమారు వందమంది కూరగాయలు అమ్ముకోవడానికి వీలుగా ప్రత్యేక మార్కెట్‌ ‌తో పాటు చికెన్‌, ‌మటన్‌, ‌ఫిష్‌ను అమ్ముకునేల మార్కెట్‌ను బల్దియా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇందులో అనువైన లైటింగ్‌, ‌ఫాన్స్, ‌స్త్రీ, పురుషులకు వేరువేరుగా ప్రత్యేక మరుగుదొడ్లు కూడా నిర్మించడం జరిగిందన్నారు. వీధి వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రోడ్ల పైన కాకుండా ఈ మార్కెట్లో వారి ఉత్పత్తులను అమ్ముకోవాలన్నారు.

రోడ్లపైన అమ్మడం వల్ల ట్రాఫిక్‌ ‌సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావడంతో పాటు గతంలో పలు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందన్నారు. ఇక మీదట రోడ్ల మీద వ్యాపారాలు నిర్వహిస్తే బల్దియా, పోలీస్‌ అధికారులు పెనాల్టీ లు విధించడంతో పాటు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున  మార్కెట్‌ ‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నెల రోజుల్లో చిరు వ్యాపారులను గుర్తించి  వారికి రూ.10 వేల లోన్‌ ‌సౌకర్యం కల్పించడానికి ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌లు చొరవ చూపుతున్నారన్నారు. ఈ అవకాశం మార్కెట్‌లో విక్రయాలు జరిపేవారికి ఉంటుందని, రోడ్ల మీద కాకుండా ఇక్కడే ఉత్పత్తులు అమ్ముకోవాలని చీఫ్‌ ‌విప్‌ అన్నారు. నగర మేయర్‌ ‌గుండా ప్రకాశరావు మాట్లాడుతూ అన్ని రకాల వసతులతో మార్కెట్‌ను నిర్మించడం జరిగిందని, ఇక మీదట రోడ్ల మీద  కూరగాయల విక్రయం చేస్తే బల్దియా తరపున రెడ్‌ ‌జోన్‌లుగా  గుర్తించడం జరుగుతుందన్నారు. చీఫ్‌ ‌విప్‌ ‌కృషి కమీషనర్‌ ‌సహకారం వల్ల చక్కటి మార్కెట్‌ ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్‌ ‌పమేలా సత్పతి, కో-ఆప్షన్‌ ‌సభ్యులు కోల వినోద, అదనపు కమీషనర్‌ ‌సిహెచ్‌ ‌నాగేశ్వర్‌, ఆరోగ్యాధికారి డాక్టర్‌ ‌రాజారెడ్డి, డిఈ నరేందర్‌, ఏసిపి గణపతి, అసిస్టెంట్‌ ‌కమీషనర్‌ ఆఫ్‌ ‌పోలీస్‌(‌ట్రాఫిక్‌) ‌బాల స్వామి, సిఐలు నరేందర్‌, ‌సత్యనారాయణ, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply