Take a fresh look at your lifestyle.

పేదలకు సేవ చేస్తే.. భగవంతుడు, అల్లా, యేసు ప్రభువుకు చేసినట్లే..!

  • నియోజకవర్గ పరిధిలోని 300 మంది నిరుపేద క్రైస్తవులకు బియ్యం పంపిణీ చేసిన
    రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీష్‌రావు 

మానవ సేవయే.. మాధవ సేవ అన్నట్లు.. ఆకలితో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడు, అల్లా, యేసు ప్రభువుకు సేవ చేసినట్లేనని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ గార్డెన్స్ ‌లో శనివారం మమ్మారే చర్చి ఆధ్వర్యంలో సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని దాదాపు 300 మంది నిరుపేద క్రైస్తవులకు మంత్రి చేతుల మీదుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సామాజిక సేవా భావంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మమ్మారే చర్చి ఫాస్టర్‌ ‌స్టీవెన్‌ ‌జ్ఞాన్‌ ‌కుమార్‌, ‌రాష్ట్ర ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ‌సభ్యులు ఆనంద్‌ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, వీరి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని కోరారు. కరోనా వైరస్‌ ‌వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రేషను కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.1500 రూపాయలను ఇప్పటికే అందించామని, రెండవ దశలో కూడా రేషను కార్డు కలిగి ఉన్న వారికి రూ.1500 చొప్పున్న సోమవారం రోజున మీ బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నదని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలను ప్రతి ఒక్కరినీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్‌ ‌భరోసా ఇచ్చారు.

నంగునూరు, చిన్నకోడూర్‌ ‌మండలాల్లో..
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కూలిన ఇళ్లకు రూ. 2 లక్షల 9 వేల రూపాయల నష్టపరిహారం అందజేసిన మంత్రి హరీశ్‌ ‌రావు…ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇళ్లు కూలిన నిరుపేదలు మంత్రి హరీశ్‌ ‌రావుకు మొర పెట్టుకున్నారు. ఈ విషయమై అర్హులైన వారందరికీ న్యాయం చేకూరేలా నష్టపరిహారం అందించేలా నివేదిక రూపొందించాలని జిల్లా, మండల రెవెన్యూ అధికారిక యంత్రాంగాన్ని మంత్రి హరీశ్‌ ఇటీవల ఆదేశించారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో మొత్తం 47 మందికి రూ.1 లక్షా 50 వేల 400 రూపాయల పరిహార చెక్కులను మండలంలోని ఆయా గ్రామ ప్రజాప్రతినిధుల సమక్షంలో మంత్రి అందించారు. అదే విధంగా చిన్నకోడూర్‌ ‌మండలంలోని 9 మందికి రూ.28 వేల 800 రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా అంద జేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!