Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌నగర్‌ ‌వద్ద సర్వీస్‌ ‌రోడ్‌ ‌పనులు వెంటనే ప్రారంభం

  • అనంతసాగర్‌ ‌వద్ద ట్రక్‌ ‌పార్కింగ్‌ ‌పనులు మూడు నెలల్లో పూర్తి
  • పొన్నాల వద్ద ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణం వెంటనే చేపట్టాలి
  • అధికారులతో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష

సిద్దిపేట కరీంనగర్‌ ‌వెళ్లే రాజీవ్‌ ‌రహదారి పెండింగ్‌ ‌పనులపై మంత్రి హరీష్‌ ‌రావు మంగళవారం హైదరాబాద్లోని అరణ్య భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిద్దిపేటలో ఇటీవల ప్రారంభమయిన కేసీఆర్‌ ‌నగర్‌ 2460 ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇళ్ల దగ్గర పది కోట్లతో 2 కిలోమీటర్ల సర్వీస్‌ ‌రోడ్‌ ‌పనులను వెంటనే ప్రారంభించాలని ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారులను ఆదేశించారు. అనంత సాగర్‌ ‌వద్ద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయనీ ఆ గ్రామం వద్ద సర్వీసు రోడ్డు వెంటనే చేపట్టాలని, డ్రైనెజ్‌ ‌కూడా నిర్మించాలని చెప్పారు. అదేవిధంగా అనంత సాగర్‌ ‌వద్ద 9 ఎకరాల విస్తీర్ణంలో 2కోట్ల తో ట్రక్‌ ‌పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్‌ ‌నగర్‌ ‌రాజీవ్‌ ‌రహదారిపై నర్సాపూర్‌ ‌చౌరస్తా వద్ద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయ్‌ అని చాలా ప్రమాదాలు జరిగి చనిపోయారని తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు ఆ దృష్ట్యా నర్సాపూర్‌ ‌జంక్షన్‌ ‌వద్ద సర్కిల్‌ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా పొన్నాల, సిద్దిపేట ప్లైఓవర్‌ ‌పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. సిద్దిపేట పొన్నాల వద్ద అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాల నివారించేందుకు 30 కోట్ల అంచనాతో ప్లైఓవర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీస్కుకొన్నామని చెప్పారు. ప్లై ఓవర్‌ ‌పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కుకునూర్‌ ‌పల్లి వద్ద కొత్తపల్లి మనోహర బాద్‌ ‌రైల్వే లైన్‌ ‌లో భాగంగా పక్క నుండి రెండు వైపుల నిర్మించే సర్వీస్‌ ‌రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని అందుకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌ ‌రెడ్డిని ఫోన్లో ఆదేశించారు.

మెదక్‌ – ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు వెంటనే ప్రారంభించాలి…
మెదక్‌ , ‌రామాయం పేట్‌, ‌సిద్దిపేట నుండి వరంగల్‌ ‌జిల్లా ఎల్కతుర్తిని అనుసంధానం చేసే జాతీయ రహదారి పనులపై మంత్రి హరీశ్‌ ‌రావు అరణ్య భవన్‌ ‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ మెదక్‌ – ‌సిద్దిపేట- ఎల్కతుర్తి జాతీయ రహదారికి నంబర్‌ ‌కేటాయించాలని కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కార్యదర్శి గిరిథర్‌, ఎన్‌ ‌హెచ్‌ ‌జాయింట్‌ ‌డైరక్టర్‌ ‌రవిని ఫోన్లో కోరారు. ఈ జాతీయ రహదారిని 1200 కోట్లతో 133 కిలోమీటర్లు నిర్మించేందుకు డీపీఆర్‌ ‌సైతం సమర్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించాలని ఎన్‌. ‌హెచ్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్‌ ‌జిల్లా ఎల్కతుర్తి నుండి సిద్దిపేట, రామాయం పేట మీదుగా మెదక్‌ ‌వరకు ఈ జాతీయ రహదారిని నిర్మించనున్నారు.

సిద్దిపేట కొత్త బస్టాండ్‌ ‌వద్ద నూతనంగా బస్టాప్‌ ఏర్పాటు చేయాలి…
సిద్దిపేట కొత్త బస్టాండ్‌ ‌కు సమీపంలోని హరిప్రియ నగర్‌, ‌టీచర్స్ ‌కాలనీల నుంచి వచ్చి పోయే స్కూల్‌ ‌బస్సులతో , చెత్త సేకరణ వాహనాలతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ ‌జామ్‌ అవుతుందని, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు మంత్రి హరీశ్‌ ‌రావు దృష్టికి తెచ్చారు. ఈ నేపధ్యంలో ఆయన ఇవాళ ఆరణ్య భవన్‌ ‌లో ప్రత్యేకంగా ఆర్టీసీ అధి•కారులతో సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ‌ను ఆనుకుని ఉండే రోడ్డు చిన్నదిగా ఉండటంతో రోడ్డును విస్తరణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఈ కొత్త బస్టాండ్‌ 438 ‌మీటర్ల ప్రహరీ గోడ తీసి వేసి రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుతో నాలుగు ఫీట్ల వరకు ఉంటే బస్‌ ‌తిప్పలేమని, ఆరు ఫీట్ల వరకు అతి కష్టం మీద పెంచగలుగుతామని అధికారులు తెలిపారు. 292 గజాల స్థలం, ప్రహరీ తొలగించి, కొత్తది నిర్మించడానికి, ప్రహరీ గోడకు ఉన్న టాయిలెట్లు కొత్తగా ఏర్పాటు చేయడానికి కోటి రూపాయల వరకు మున్సిపాలిటీ నుండి ఆర్టీసికి చెల్లించాలని ఇప్పటికే కోరడం జరిగిందని మంత్రి చెప్పారు.

ఈ సందర్బంగా జిల్లాలోని పలు బస్టాండ్‌ ‌నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నర్సాపూర్‌ ఆర్టీసీ డిపో నిర్మాణ పనుల జాప్యంపై మంత్రి హరీశ్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి మొదటి వారం కల్లా డిపో నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా కొమరవెల్లి, సదాశివపేట బస్టాండ్‌ ‌నిర్మాణపనులు నెమ్మదిగా జరగడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెర్యాల బస్‌ ‌స్టాండ్‌ ‌నిర్మాణ పూర్తయిందని, దీన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాలలో ఆర్టీసీ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌ ‌స్కూల్స్ ‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ ‌ద్వారా డ్రైవింగ్‌ ‌నేర్పించి సర్ఠిఫికెట్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేందిర, ఆర్‌ అం‌డ్‌ ‌బి చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌మధుసూదన్‌ ‌రెడ్డి, ఎన్‌ ‌హెచ్‌ ‌సర్కిల్‌ ఎస్‌ఈ ‌శ్రీనివాస్‌, ‌సంగారెడ్డి ఆర్టీసీ రీజనల్‌ ‌మేనేజర్‌ ‌రాజశేఖర్‌, ‌టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌రాం ప్రసాద్‌, ఆర్టీసీ ఈఈ రాంబాబు పాల్గొన్నారు.

Leave a Reply