Take a fresh look at your lifestyle.

కడప జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

కడప, జనవరి 20 : కడప జిల్లాలోని చాపాడు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

ప్రొద్దుటూరు వైఎమ్మార్‌ ‌కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో అనూష, ఓబులమ్మ, రామలక్షుమ్మగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply