- లారీని ఢీకొన్న ప్రీవెడ్డింగ్ షూట్‌కు వెళుతున్న కారు
- నలుగురు వ్యక్తుల దుర్మరణం…ఒకరికి తీవ్ర గాయాలు
- కూకట్‌పల్లిలో టూవీలర్‌ను ఢీకొన్న టిప్పర్ …ఒకరు మృతి
భదాద్రి కొత్తగూడెం/హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21 : భదాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సవి•పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సవి•పంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కారు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు దవాఖానకు తీసుకెళ్తుండగా మరణించారని పోలీసులు తెలిపారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా, గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భదాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలుస్తున్నది.
కూకట్‌పల్లిలో టూవీలర్‌ను ఢీకొన్న టిప్పర్ …ఒకరు మృతి
నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మెట్రోపిల్లర్ నెంబర్ 822 వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హేమంత్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.