Take a fresh look at your lifestyle.

ప్రపంచ శాంతికి కొరోనా విఘాతం??

ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంటేనే విశ్వ ప్రగతి సాధ్య పడు తుందని నిర్థా రణకు వచ్చిన ఐరాస తీర్మానం ప్రకారం ప్రతియేటా 21 సెప్టెంబర్‌ ‌రోజున సభ్యదేశాలు ‘‘అంతర్జాతీయ శాంతి దినం’’ పాటిస్తున్నాయి. దేశాల మధ్య వివాదాలు బయట పడినపుడు ఐరాస చొరవ తీసుకొని సమస్యకు తాత్కాలిక, శాశ్వత పరిష్కారం చూపడం, కాల్పుల విరమణకు కృషి చేపడుతుంది. ప్రపంచంలో యుద్ధ వాతావరణం చల్లబరచి మానవీయ కోణంలో సామాన్య ప్రజలకు అండగా ఉండడం ఆనవాయితీ.. 1981 నిర్ణయం ప్రకారం 1982 నుండి ఐరాస దేశాలు, రాజకీయ సమూహాలు, సైన్యం, సామాన్య ప్రజలు శాంతి దినం నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల ఉమ్మడి శత్రువు, ప్రపంచ ఆరోగ్య సమస్యకు ఏకైక కారణంగా కరోనా వైరస్‌ ‌కరాళనృత్యం చేస్తున్నది. ఐరాస రూపొందించిన ‘యూయన్‌75’ ఉద్యమంలో విశ్వ దేశాల మిలియన్ల ప్రజలు శాంతియజ్ఞంలో భాగస్వాములై కోవిడ్‌-19‌ను తరిమివేయాలని పిలుపు నిచ్చాయి. చైనాలో పుట్టిన మహమ్మారి అన్ని దేశాలను కబళించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. కరోనా వైరస్‌ ‌చైనా ప్రయోగశాలలో కృత్రిమ పద్ధతిలో తయారై, ప్రపంచదేశాలను అస్థిరపరిచేందుకు రసాన ఆయుధంగా వినియోగించారని అమెరికాతో పాటు అనేక దేశాలు చైనాపై ఆరోపణు కురిపిస్తున్నాయి. కోవిడ్‌-19 ‌విజృంభనతో ప్రపంచ శాంతి గాలిలో దీపమైంది. లడక్‌ ‌సరిహద్దులలో చైనా నిత్యం భారత సైన్యంతో పంచాయతీ పెట్టుకుంటున్నదని అందరికీ తెలిసిన విషయం. దినదినం పరిస్థితి ముదిరి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రస్తుత అకాలంలో సామాజిక దూరాలతో శాంతిని కోరుతూ దగ్గరై, మాస్కులతో మూతులు కట్టుకొని మాటను నిలబెట్టుకొని, సానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటూ మదిలోని దుర్భుద్ధులను కడిగి పారేస్తూ, విశ్వశాంత కపోతం రెపరెపలాడుతూ భూగోళాన్ని చుట్టేలా ప్రతి ఒక్కరం చేయూత అందించాలి. వైరస్‌తో వైరం పెరుగకుండా జాగ్రత్త పడుతూ దేశాలు, జాతుల మధ్య సోదరభావం, కరుణ, దయాగుణాలతో శాంతి స్థాపనకు కృషి చేయాలి..

సంస్కృతి, వారసత్వం, జీవన విధానాలలో భిన్నత్వం, వైవిధ్యం ఆధారంగా శాంతి స్థాపనకుకృషి జరుగుతోంది. విద్య, కళలు, క్రీడలతో సామాజిక న్యాయం, ఆరోగ్యకర పర్యావరణం సమన్వయం చేసుకుంటూ ,శాంతి నెలకొల్పే దిశలో ప్రయత్నాలు ఉండాలని ఐరాస కోరుతున్నది. స్వయం నియంత్రణ, సహనంతోనే శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయని ఆశిద్దాం. శాంతి స్థాపన విధులలో ప్రాణా లర్పించిన యోధులకు నివాళులు అర్పిస్తూ, శాంతి ప్రార్థనలు, మౌనం పాటిద్దాం. శాంతి కోరుతూ మ్నెక్కలు నాటుదాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply