Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి..

భారతదేశమంతా 1947 వ సంవత్సరం ఆగస్టు 15న బ్రిటీషు బానిస సంకెళ్ళ నుండి స్వాతంత్రం పొందింది. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాద శక్తుల నుండి దేశ యువత అంతా బంధవిముక్తులై స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నారు. మువ్వన్నెల పతాకం దేశం నలుమూలలా రెపరెప లాడుతున్నది. అయితే ఆనాటి హైదరాబాద్‌ ‌సంస్థానమైన నేటి తెలంగాణ ప్రాంతం మరియు మహరాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు మాత్రం స్వేచ్ఛా వాయువుల కొరకు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. నాటి హైదరాబాద్‌ ‌సంస్థానం నిజాం నవాబు ఏలుబడి లో ఉండేది, నిజాం నవాబు దాస్య శృంఖలాల నుండి రజాకార్ల ఆకృత్యాలనుండి నాటి హైదరాబాద్‌ ‌సంస్థానానికి ఉక్కు మనిషి భారత ఉప ప్రధాని సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌మరియు ఆనాటి ఏజెంట్‌ ‌జనరల్‌ ‌కె.ఎం.మున్షీ చాకచక్యం ద్వారా హైదరాబాద్‌ ‌సంస్థానం విముక్తి పొందింది, భారత యూనియన్‌ ‌లో విలీనమైంది, నిజాం అరాచకాల నుండి విముక్తి పొందింది కావున ఇది ముమ్మాటికీ విమోచనమే, ఈ విముక్తి కొరకు వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు, తమ సర్వస్వాన్నీ త్యాగం చేశారు, వందల గ్రామాలను ఆనవాళ్ళు సైతం లేకుండా కోల్పోయారు మాతృభూమి స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించిన అనేకమంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ విమోచన విమోచనం కావున ఏది ఏమైనప్పటికీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గతంలో ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించినట్లుగానే తెరాస ప్రభుత్వం అధికారికంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలి

అయితే నిజాం నవాబు ఎవరు ఎందుకు ఇంతటి ఆకృత్యాలకు ఒడిగట్టారు అంటే కారణం కూడా లేకపోలేదు నిజాం నవాబు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి నమ్మకమైన బంటు, బ్రిటిష్‌ ‌పాలకులకు తొత్తులుగా మారిన దేశద్రోహి, హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని సార్వభౌమాధికారాలు గల ఇస్లాం రాజ్యాంగా రూపొందించాలనే కలలు కంటూ తద్వారా హైదరాబాద్‌ ‌సంస్తానానికి సరిహద్దుగా ఉన్న గోవా ప్రాంతాన్ని కొనుగోలు చేసి సముద్ర మార్గం ద్వారా బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంతో వ్యాపార లావాదేవీలు చేసుకుని ఇక్కడున్న హిందూ సమాజాన్ని బానిసలుగా చేసుకునేందుకు మరియు వారిని శ్రమ దోపిడీకి గురి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. నిజాం నవాబు బయటకు హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళ లాంటి వారు. ఇరువురు సోదరభావంతో కలిసుండాలి అని నీతులు వల్లిస్తూనే రజాకార్లతో హిందువులపై దాడులు చేయించేవాడు, ప్రభుత్వంలో ఉన్నవారు కూడా నిజాం నవాబుకు వంత పాడటం తప్పితే మరో గత్యంతరం ఉండేది కాదు. నిజాం నవాబు హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని భారత యూనియన్‌ ‌లో చేరకుండా తీవ్ర ప్రయత్నాలు చేశాడు భారత సైన్యం తో సైతం యుద్ధం చేయడం కొరకు ఆయుధాలను కూడా వరంగల్‌ ‌లోని మన్ననూరు విమానాశ్రయం ద్వారా తెప్పించుకున్నాడు, నిజాం నవాబు రజాకార్ల ద్వారా రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ, తన తమ్ముడు తయ్యబ్‌ ‌రజ్వీ ద్వారా ఇక్కడున్న హిందువులను చిత్రహింసలకు గురి చేసేవారు దోపిడీలు, మానభంగాలు, హత్యలు ఇలా చెప్పుకోలేనివెన్నో, ఎన్నో చిత్రహింసలు, మానసిక క్షోభ ఇవన్నీ భరించినా చివరికి ప్రాణాలు దక్కుతాయా అంటే దక్కుతాయని ఖచ్చితంగా చెప్పలేం మరి ఇంతటి దారుణాల నుండి విముక్తి పొందిన అటువంటి రోజున తెలంగాణ విమోచన దినోత్సవం జరిపితే తప్పేంటి, తప్పేమీ లేదు, తప్పకుండా తెరాస ప్రభుత్వం తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిందే. నీళ్లు నిధులు నియామకాలు తక్కువ అయ్యాయనే మనం సమైక్యాంధ్ర నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం, రాష్ట్రం వచ్చిన రోజు పండుగగా జరుపుకుంటున్నాం, అటువంటిది నిజాం దాస్య శృంఖలాల నుండి, రజాకార్ల అకృత్యాల నుండి, విముక్తి పొందిన రోజు సెప్టెంబర్‌ 17‌ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటే తప్పేంటి ప్రభుత్వం జరపాల్సిందే అంతేకానీ నేటి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌గారు మైనార్టీల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఎంఐఎం మద్దతు కోరకో నేను నిజాం వారసుడు అని ప్రకటించడం, నిజాం గొప్ప రాజు అని కీర్తించటం, నిజాంను స్తుతించటం నాటి అమరవీరులను అవమానించడమే అవుతుందని తెలంగాణా సభ్య సమాజం భావిస్తోంది

ఎన్నో ఆకృత్యాలు జరిగాకే, ఎన్నో గ్రామాల ఆనవాళ్లు కోల్పోయాకే, ఎన్నో త్యాగాల మూల్యం చెల్లించాకే
12, సెప్టెంబర్‌ 1948‌న భారతీయ సైన్యాలు సంస్థానం లోకి ప్రవేశించాయి, నిజాం వారితో యుద్ధం చేసే ప్రయత్నం చేశాడు. భారత సైన్యం నిజాం దగ్గర నిజాం కవ్వింపు చర్యలు సాగకపోయేసరికి 17 సెప్టెంబర్‌ 1948 ‌న నిజాం నవాబు నాటి భారత ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌దగ్గర లొంగిపోయాడు. ఆ క్షణం నుండి హైదరాబాద్‌ ‌సంస్థానానికి నిజాం పాలన నుండి రజాకార్ల అకృత్యాలు నుండి విముక్తి లభించింది హైదరాబాద్‌ ‌సంస్థానం విమోచనం పొందింది. ఆ తర్వాత కె.ఎం.మున్షీ దగ్గరున్న గూఢచారులు అందించిన సమాచారం ప్రకారం ఖాసిం రజ్వీ తన తమ్ముడు తయ్యబ్‌ ‌రజ్వి లను భారత ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన తదనంతరం రజాకార్లు కొంతమంది లొంగిపోయారు. కొంతమంది పారిపోయారు. కావున ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఎన్ని విధ్వంసాలు జరిగిన తర్వాత హైదరాబాద్‌ ‌సంస్తానానికి విమోచనం కలిగిన ఆ రోజును సెప్టెంబర్‌ 17‌ను నాటి అమరవీరుల త్యాగ ఫలితంగా గుర్తించి తెలంగాణ ప్రాంతంలో కూడా మహారాష్ట్ర మరియు కర్ణాటకలో జరుగుతున్నట్లుగా తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి తద్వారానే ఆ అమరవీరులకు సరైన నివాళిని అందజేసినవారమవుతామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అంతేగాని మైనార్టీల సంతుష్టీకరణ కొరకు వోటు బ్యాంకు రాజకీయాల కొరకు ఎంఐఎం మద్దతు కొరకో నేనే నిజం వారసుడిని అని, నిజాం గొప్ప రాజు అని కీర్తించడం వంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కు తెలంగాణ ప్రజలు హితవు పలుకుతున్నారు. నిజాంను కీర్తించడం ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్ర మెజారిటీ ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. చివరిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ సభ్యసమాజం డిమాండ్‌ ‌చేస్తున్నది.

– జవ్వాజి దిలీప్‌ ‌వీ.M.Tech,JNTUH
సామాజిక కార్యకర్త, 7801009838

Leave a Reply