Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విలీన దినమే

  • అనవసర రాద్దాంతంత తగదు
  • తెలంగాణ భవన్‌లో జెండా ఎగరేసిన కెకె

సెప్టెంబర్‌ 17 ‌ముమ్మాటికి విలీన దినమని, దీనిపై రాద్దాంతం అనవసరమని టిఆర్‌ఎస్‌ ‌సెక్రటరీ జనరల్‌ ‌కె కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో విలీన దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపీ కే కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విలీన దినమేనని, ఇవాళ సంతోషకరమైన రోజని, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం రాలేదని, ఇవాళ మనకు సంపూర్ణ స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. సెప్టెంబర్‌ 17‌పై వివాదాలు అనవసరమన్నారు.

భారత్‌లో మనం కూడా విలీనం కావాలని కోరుకున్నామని, సెప్టెంబర్‌ 17‌పై కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కేశవరావు విమర్శించారు. 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదని, ఏడాది తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అందువల్ల సెప్టెంబర్‌ 17‌న మన స్వాతంత్య్రం సంపూర్ణమయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌ ‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply