Take a fresh look at your lifestyle.

సెప్టెంబర్‌ 17 ‌చారిత్రక నేపథ్యం

నిజాం పాలన అదొక దయ్యాలమేడ, శిథిల సమాజాల నీడ,  పీనుగులను పీక్కుతినే రాబందుల రాచ వాడ..’’- మగ్దూం మొహియుద్దీన్

- Advertisement -

చరిత్రే భవిష్యత్తుకు బలమైన పునాది, పునాది లేకుండా కట్టడం మనుగడ సాగించలేదు. గతం లేకుండా వర్తమానం, భవిష్యత్తు ఉండదు. అందుకే చరిత్ర తెలుసుకోవడం ఆవశ్యం. సెప్టెంబర్‌ 17 ‌చారిత్రక నేపథ్యం ఏవిటో తెలుసుకుందాం. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్‌ ‌పాలనలో ఆర్థిక వనరులు , సహజ వనరులు దోపిడికి గురై, భారతదేశ ప్రజలు బానిసలుగా మగ్గుతున్న సమయంలో జాతీయ నాయకుల త్యాగాల ఫలితంగా దాస్య శృంఖలాలను తెంచుకొని దేశం 1947 ఆగస్టు 15 స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న సమయం. 568 సంస్థానాల్లో నాలుగు తప్ప మిగితా సంస్థానాలన్నీ యూనియన్‌ ‌ప్రభుత్వంలో విలీనం అయినాయి. నిజాం సంస్థానం, జమ్ము కాశ్మీర్‌, ‌జునా ఘడ్‌ , ‌త్రిపుర సంస్థానాలు మాత్రం యూనియన్లో కలవడానికి తిరస్క రించాయి. దీనికి కారణం అప్పటి గవర్నర్‌ ‌జనరల్‌ ‌లార్డ్ ‌మౌంట్‌ ‌బాటెన్‌ ‌చేసిన ప్రకటన ప్రకారం సంస్థానాలన్నీ యూనియన్‌ ‌లో కలవచ్చు, స్వతంత్రంగా ఉండవచ్చు, పాకిస్తాన్‌ ‌తో కూడా కలవ వచ్చు. నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌హైదరాబాద్‌ ‌రాజ్యం పాకిస్తాన్లో కలుస్తుందని ప్రకటించారు.

నిజాం సంస్థానం విలీనానికి భారత ప్రభుత్వం ఒత్తిడి చేయగా సుదీర్ఘ చర్చల అనంతరం 29 నవంబర్‌1947 ‌న ఒక ఒప్పందం జరిగింది, అదే యథాతథ ఒడంబడిక. ఈ ఒప్పందం ప్రకారం సంవత్సరం పాటు నిజాం సంస్థానం స్వతంత్రం గా ఉండడం, సంస్థానంలోని శాంతిభద్రతల సంరక్షణ, విదేశీవ్యవహారాలన్నీ భారత ప్రభుత్వం అధీనంలో ఉండడం. ఒప్పందం పై మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌, ‌ప్రభుత్వం తరఫున మౌంట్‌ ‌బాటన్‌ ‌సంతకం చేశారు. భారత్‌ ‌తో యుద్ధం చేయాలన్న ఆలోచనతో ఆయుధాలు సమకూర్చుకునేందుకు నిజాం సైనిక అధికారి జనరల్‌ ‌సయ్యద్‌ అహ్మద్‌ ఎల్‌ ఆం‌డ్రూస్‌ ‌ను ఇంగ్లాండుకు పంపాడు. సిడ్నీ కాటన్‌, ‌హెండ్రీల సుజాలా తో ఆయుధాలు సమకూర్చుకోవడానికి , మందు గుండుసామాగ్రి సరఫరాకు రిటైర్డ్ ‌సైనికాధికారితో ఒప్పందాలు జరిగాయి. లార్డ్ ‌మౌంట్బాటెన్‌ ఈ ‌విషయాన్ని పసిగట్టి ఆస్ట్రేలియా నుండి ఆయుధాలతో బయలుదేరిన నావను సముద్రంలోని నిలువరించారు. భారత ప్రభుత్వం జారీచేసే కరెన్సీ చలామణి రూపాయి వాడకంపై కూడా నిజాంరాజు ఆంక్షలు విధించాడు. పాకిస్తాన్‌ ‌నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా తో కూడా సత్సంబంధాలు ఉండేవి. హైదరాబాద్‌ ‌విషయం అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో నిజాం ప్రధాని మీర్‌ ‌లాయక్‌ అలీ, సర్‌ ‌వాటర్‌ ‌మాల్టన్‌ ‌తో కలిసి 24 ఆగస్టు 1948 న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిర్యాదు చేసారు. ఐక్యరాజ్యసమితి చర్చలకు ఆహ్వానించింది. క్రమంగా ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న నిజాం వ్యవహారశైలిని భారత ప్రభుత్వం గమనించిది, ప్రతీకార చర్య గా భారత గగనతలంలో దక్కన్‌ ఎయిర్‌ ‌వేస్‌ ‌నిషేధించింది, ఢిల్లీ – మద్రాస్‌ ‌గ్రాండ్‌ ‌ట్రంక్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌నిజాం రాష్ట్రం నుండి కాకుండా దారి మళ్ళించారు. టెలిఫోన్‌ ‌సంభాషణలు వినిపించకుండా అవరోధాలు కల్పించారు. బంగారం, వజ్రాభరణాలు, నాణేల ఎగుమతుల నిషేధించారు. ఇంపీరియల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా, స్టేట్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌హైదరాబాద్‌ ‌మధ్య సంబంధాన్ని రద్దుచేసారు. వీటివల్ల నిజాం ఎదుట రెండే ఐచ్ఛిక అంశాలు మిగిలాయి.

1) విలీనం లేదా 2 ) భారత ప్రభుత్వంతో యుద్ధం. ఇది ఇలా ఉండగా 21 జూన్‌ 19 48 ‌న మౌంట్‌ ‌బాటన్‌ ‌పదవి విరమణ అనంతరం ఆ స్థానంలో గవర్నర్‌ ‌జనరల్‌ ‌గా చక్రవర్తుల రాజగోపాలచారి పదవీ బాధ్యతలు చేపట్టటంతో నిజాం సంస్థానంపై చర్యలకు మార్గం సులువైంది. కానీ ప్రధానమంత్రి నెహ్రూకు నాటి హోం మంత్రి ఉక్కు మనిషి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌మధ్య బేదాభిప్రాయాలుండేవి. హింసా మార్గంలో హైదరాబాద్‌ ‌సంస్థానం కలుపుకోవడం నెహ్రూకు ఇష్టంలేదు. నిజాం సంస్థానం లో జరుగుతున్న హృదయవిదారక ఘటనలు, ఆకృత్యాలు, రజాకార్ల ఆగడాలు, హిందువుపై హత్యాకాండ, శాంతి భద్రతలను కాపాడడానికి పటేల్‌ ‌రక్షణ కమిటీలో చర్చించి నిరసనగా వాకౌట్‌ ‌చేసారు. అప్పుడు రాజాజి మధ్యవర్తిత్వం వల్ల నెహ్రూ, పటేల్‌ ‌మధ్య సయోధ్య ఏర్పడి సైనిక చర్యకు నిర్ణయించారు. జూన్‌ 1948‌లో భారత ప్రభుత్వం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌తో జరిపిన చర్చలు విఫలమైన వెంటనే సైనిక చర్య జరగాల్సింది కానీ ఇతర కారణాల వలన వాయిదా పడింది. సెప్టెంబర్‌ 12, 1948 ‌నిజాం మద్దతుదారు, దేశవిభజనకు కారకుడైన మహమ్మద్‌ అలీ జిన్నా మరణంతో హైదరాబాద్‌ ‌రాజ్యంలో మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు జరిపి, సెలవు ప్రకటించింది . రుణం తీసుకున్న పాకిస్థాన్‌ ‌నాయకుడి మరణం,.. సెప్టెంబర్‌ 13 ‌రక్షణ మంత్రి బల్దేవ్‌ ‌సింగ్‌ ‌ప్రమేయం లేకుండా పటేల్‌ ఆదేశానుసారం సదరన్‌ ‌కమాండ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌మహారాజా సింగ్‌ ‌నాయకత్వంలో ఆపరేషన్‌ ‌పోలో మొదలైంది. సోలాపూర్‌ ‌నుండి మేజర్‌ ‌జనరల్‌ ‌జయంతి నాథ్‌ ‌చౌదరి ఆధ్వర్యంలో, విజయవాడ నుండి మేజర్‌ ‌జనరల్‌ ‌రుద్ర ఆధ్వర్యంలో, లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌రాజాసింగ్‌ ‌నేతృత్వంలోన మరో ఇండియన్‌ ఆర్మీ నలువైపులా నిజాంరాజ్యాన్ని చుట్టుముట్టి ఔరంగాబాద్‌, ‌లాతూరు, సూర్యాపేట, వరంగల్‌ ‌స్వాధీనం చేసుకొని ముందుకు సాగాయి. సెప్టెంబర్‌ 17‌న బీబీనగర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సమీపంలో బాంబుల వర్షం కురుస్తుందని, ఆ స్టేషన్‌ ‌మాస్టర్‌ ‌నిజాం ప్రధాని లాయక్‌ అలీకి ఫోన్‌ ‌చేసారు. హైదరాబాద్‌ ‌కింగ్‌ ‌కోటి లోని నిజాం నవాబు నివాసంపై విమానాలు తిరుగగా, బాంబులు వేస్తారనే భయంతో భారత సైన్య శక్తి తట్టుకోలేక నిజాం సైన్యం బెంబేలెత్తి, సైనిక అధికారి ఎల్‌ అం‌డ్రూస్‌ ‌భారత సైన్యంతో పోరాడవద్దని రహస్య ఆదేశాలు జారీ చేసి బొల్లారం సైనిక రెసిడెన్సీలో మేజర్‌ ‌జనరల్‌ ‌జయంతి నాథ్‌ ‌చౌదరిఎదుట లొంగిపోయారు. నిజాం దివాన్‌ ‌లాయక్‌ అలీమంత్రి మండలిని ఏర్పాటు చేసి రాజీనామా చేసారు. మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌రేడియో ప్రకటనలోహైదరాబాద్‌ ‌రాజ్యం భారత యూనియన్‌ ‌లో కలుస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌ ‌రాజ్యంలో మిలటరీ పాలన ప్రారంభమైంది. నిజామును హైదరాబాద్‌ ‌రాష్ట్ర రాజ్‌ ‌ప్రముఖ్‌ ‌గా నియమించారు. రాజ భరణం కింద 15000000 ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈపదవిలో మీర్‌ ఉస్మాన్‌అలీ ఖాన్‌ 1956‌లో ఆంధప్రదేశ్‌ ఏర్పడే వరకు కొనసాగారు.

ఏడు తరాలు పాలించిన ప్రభుత్వం ఉదార, అరాచకాలతో కూడిన పాలన ఆపరేషన్‌ ‌పోలోతో అంతమైంది. కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల అరాచకాలకు ఆకృత్యాలకు ఎదురుతిరిగి పోరాటం చేసిన సామాన్య పౌరుల నెత్తుటి ధారలతోన నిజాం పాలన అంతమైంది. ‘‘నిజాం పాలన అదొక దయ్యాలమేడ, శిథిల సమాజాల నీడ , పీనుగులను పీక్కుతినే రాబందుల రాచ వాడని’’ మగ్దూం మొహియుద్దీన్‌ ‌ఖాన్‌ ‌వర్ణించారు. ఈ సాయుధ పోరాటం మహాత్మా గాంధీ నుండి మావో వరకు తన వైపుకు తిప్పుకొని ఆలోచించేలా చేసింది. ఒక చేత్తో గన్ను ఒక చేతిలో పెన్ను పట్టుకొని కవులు కళాకారులు సుద్దాల హనుమంతు, యాదగిరి, తిరునగరి రామాంజనేయులు , ఆవుల పిచ్చయ్య, దాశరధి , షోయబుల్లాఖాన్‌, ‌షేక్‌ ‌బందగి, చిట్యాల ఐలమ్మల లాంటి ఎందరో వీరోచిత పోరాటం చేశారు. సెప్టెంబర్‌ 17 ‌ప్రత్యేకత గురించి భిన్న వాదనలు న్నాయి. కొందరు విముక్తి అంటుంటే, కొంతమంది విమోచనం అంటూంటే, మరికొంత మంది విద్రోహ దినం అంటున్నారు. నిజాం సంస్థానం భారత ప్రభుత్వంలో కలుపుతా నిజాం రాజు తనకు తానుగా ప్రకటన చేసి విలీనం చేశాడు కనుక ఈరోజు ను విలీన దినమని అంటున్నారు. మొత్తానికి రాచరికపు రాచపుండు వ్యవస్థ రూపుమాసి పోయింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచినా స్వాతంత్ర ఫలాలు సామాన్య ప్రజలకు అందనంత దూరంలోనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి, మలి దశ పోరాటాలలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించాలంటే నిజాం వ్యవస్థలో సైతం విద్యా వైద్య కార్యక్రమాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నట్లు నేటి ప్రభుత్వం కూడా విద్య వైద్యం తస ఆధీనంలోని తీసు కొని ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం పాటు పాడాలి. అదే నిజాం నిరంకుశ పాలనకు బలయిన పోరాట వీరులు, తెలంగాణ తొలి మలి దశవిద్యార్థి అమరవీరులకు నిజమైన నివాళి.

thanda sadhanandham
తండ సదానందం
9989584665.

Leave a Reply