Take a fresh look at your lifestyle.

సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌ధర్మాసనం శ్రీధర్‌ ‌మృతి

  • కొరోనాతో పోరాటంలో ఓడిన కలం యోధుడు
  • తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక
  • సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌ ‌తదితరులు
మా హైదరాబాద్‌’ ‌సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సీనియర్‌ ‌జర్నలిస్టు శ్రీధర్‌ ‌ధర్మాసనం మృతి చెందారు. కొరోనా చికిత్స తీసుకుంటూ బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ధర్మాసనం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన  కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీధర్‌.. ‌టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కన్నుమూశారు. శ్రీధర్‌ ‌మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. సీనియర్‌ ‌జర్నలిస్టు, ’మా హైదరాబాద్‌’ ‌సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్‌ ‌ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అందించడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టు మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. వి•రంతా సురక్షితంగా ఉండాలని మంత్రి సూచించారు. విధి నిర్వహణలో కొరోనా మహమ్మారి బారిన పడి ఎందరో కలం వీరులు ప్రాణాలు కోల్పోతున్న తీరు నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. అక్షర యోధులకు జోహార్లు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
సీనియర్‌ ‌జర్నలిస్టు శ్రీధర్‌ ‌ధర్మాసనం మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మా హైదరాబాద్‌ ‌సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారన్నారు. ఆయన మరణం జర్నలిస్ట్ ‌సమాజానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి తెలిపారు. మిత్రుడు  శ్రీధర్‌ ‌ధర్మాసనం మరణం బాధాకరం అని ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ‌ఫోరమ్‌తో కలిసి ప్రయాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీధర్‌ ‌మరణం తెలంగాణ జర్నలిస్టులకే కాదు తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ ఎలా ఉండాలో కలలు కన్న వ్యక్తి మధ్యలోనే అందరిని విడిచి పోవడం బాధాకరం. శ్రీధర్‌ ‌కుటుంబానికి ఎమ్మెల్యే క్రాంతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జర్నలిస్టు ధర్మాసనం శ్రీధర్‌ ‌మరణం పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మా హైదరాబాద్‌ ‌సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం జర్నలిస్ట్ ‌సమాజానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్ ‌మిత్రులు తగు కొవిడ్‌ ‌జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వేముల విజ్ఞప్తి చేశారు. సీనియర్‌ ‌జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్‌ ‌ధర్మాసనం మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ‌చైర్మన్‌ ‌బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. వారి మృతి పట్ల సంతాపం తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీధర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
శ్రీధర్‌ ‌మరణం తెలంగాణకు, జర్నలిస్ట్ ‌లోకానికి తీరని లోటని వి•డియా అకాడమే ఛైర్మన్‌ ‌ల్లం నారాయణ అన్నారు. ఆయన మృతి తీవ్రంగా బాధించిందన్నారు. ఆయన కుటుంబానికి అల్లం తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ ధర్మాసనం శ్రీధర్  మృతి పట్ల తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా. చెరుకు సుధాకర్  తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  తెలంగాణ ఉద్యమంలో,jac ఆవిర్భావంలో కీలకంగా పని చేసిన వ్యక్తి కొరోనా వల్ల మరణించడం బాధగా ఉందన్నారు. తెలంగాణలో రాజకీయాలు మారాలని కోరుకునే అభ్యుదయ వాది అని కొనియాడారు. దాదాపు 20 మంది పాత్రికేయులు కొరోనా వల్ల చనిపోయారు వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలనీ చెరుకు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు   ధర్మాసనం శ్రీధర్‌ ‌మృతికి తెలంగాణ జర్నలిస్ట్ ‌జాక్‌ ‌తీవ్ర సంతాపం ప్రకటించింది. ఇది జర్నలిస్ట్ ‌లోకానికి తీరని లోటని కన్వీనర్‌ ‌దేవరకొండ కాళిదాస్‌, ‌కో కన్వీనర్‌ అవ్వారు రఘులు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వృత్తిపరంగా జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని, కొరోనా నిబంధనలతో విధులు నిర్వహించాలని వారు హెచ్చరించారు.

Leave a Reply