Take a fresh look at your lifestyle.

‌ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపండి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుయార్‌ ‌రెడ్డి

దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ ‌రెడ్డి నామినేషన్‌

‌వచ్చే నెల 3న జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గురువారం దుబ్బాకలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్యకు తన నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ను పురస్కరించుకుని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ వ్యవహరాల సహాయ ఇంఛార్జి బోసురాజుతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నాయకులు వందలాదిగా దుబ్బాకకు తరలివచ్చారు.

దుబ్బాక నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో దుబ్బాకకు తరలివచ్చారు. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్‌ ‌సందర్భంగా భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో దుబ్బాక మొత్తంగా కాంగ్రెస్‌ ‌జెండాలు, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులతో నిండిపోయింది. ఈ సందర్భంగా పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రశ్నించే గొంతుకు అసెంబ్లీకి పంపాలని దుబ్బాక నియోజకవర్గ వోటర్లకు విజ్ఞప్తి చేవారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుడి వలే పని చేయాలన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో, దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి హయాంలోనే జరిగిందన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే దుబ్బాక ఉప ఈ ఎన్నికలు వచ్చాయని  అన్నారు. దుబ్బాక ఎన్నిక రాష్ట్రంలో మార్పునకు శ్రీకారం చుట్టాలని ఉత్తమ్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply