Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ భూముల అమ్మకం తగదు

  • వెంటనే జివో ఉపసంహరించుకోవాలి
  • ప్రభుత్వం అమ్మే భూములు ఎవరికి వెళతాయో అందరికీ తెలుసు
  • అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కెసిఆర్‌దే
  • కాంగ్రెస్‌ ‌నేతలు శ్రీధర్‌ ‌బాబు, విహెచ్‌ ‌విమర్శ
  • పిసిసి రేసులో తాను లేనన్న శ్రీధర్‌ ‌బాబు

ప్రభుత్వ భూమల అమ్మకాన్ని కాంగ్రెస్‌ ‌నేతలు మరోమారు తప్పుపట్టారు. భూముల అమ్మకాలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరారు. ఇలా అమ్ముకుంటూ పోతే తెలంగాణలో అవసరాలకు ఇక భూమి కూడా మిగలదని అన్నారు. పార్టీ సీనియర్‌ ‌నేతలు వేర్వేరుగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల భూమిని అమ్మాలని చూస్తున్నదని, ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ వి•డియా పాయింట్‌ ‌వద్ద మాట్లాడుతూ.. ఆస్తులను కాపాడుకునేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కానీ అమ్మడానికి కాదనీ, మిగులు బ్జడెట్‌ ఉన్న రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మ లేదా అని హరీష్‌ ‌రావు అంటున్నారని, ఆనాడు ఆస్తులు అమ్మతుంటే వొద్దని తాము ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పామని తెలిపారు.

జిల్లాలో భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. ఆరున్నర సంవత్సరాలుగా అనేక పనులు కూడా ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయని, ఇప్పుడు అమ్మే భూములు ఎవరికి, ఏ ప్రాంతం వారికి అమ్ముతారని ఆయన ప్రశించారు. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం జరుగుతున్నదని శ్రీధర్‌ ‌బాబు ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో వేల ఎకరాలు పేదలకు పంచామని, పోడు భూములు కూడా పంపిణీ చేశామని, మన భూములను తెలంగాణ రాష్ట్ర సమితి అమ్మే ప్రయత్నం చేస్తున్నదని, వాళను ఏ విధంగా వెల్లగొట్టాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. ఆర్థికలోటు పూడ్చుకోవడానికి భూములు అమ్మడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో తప్పు పట్టిన టీఆర్‌ఎస్‌..ఇప్పు‌డెలా భూములు అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం అమ్మే భూములు ఎవరికి వెళతాయో అందరికి తెలుసునన్నారు.

తాను టీపీసీసీ రేసులో లేనని శ్రీధర్‌ ‌బాబు స్పష్టం చేశారు. పార్టీలో ఎవరికి పీసీసీ ఇచ్చినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. కేసుల మాఫీ కోసం కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్కటేనన్నారు. ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో ఎందుకు చేరారో ఆయనే చెప్పాలని శ్రీధర్‌ ‌బాబు అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్‌లో స్మశానాలకు కూడా స్థలం దొరకదని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. భూములు అమ్ముకుంటూ పోతే భవిష్యత్‌ ‌తరాలకు ఇబ్బంది అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు భూములన్నీ అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా? అని ప్రశ్నించారు.

పార్టీలన్నీ కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వీహెచ్‌ ‌పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకే పీసీసీ ఇవ్వాలన్నారు. 2019 ఏప్రిల్‌ 12‌న జై భీం కార్యకర్తలు పంజాగుట్టలో అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని పెట్టే ప్రయత్నం చేయగా.. మున్సిపల్‌ అధికారులు విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. మళ్ళీ తాము విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తే తీసుకువెళ్లి గోశామహల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో పెట్టారని వీహెచ్‌ ‌పేర్కొన్నారు. కల్నల్‌ ‌సంతోష్‌ ‌విగ్రహం పెట్టడం సంతోషమే కానీ అంబేద్కర్‌ ఏం ‌పాపం చేశారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ‌వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. అసదుద్దీన్‌ ఒవైసి, చాడా వెంకట్‌ ‌రెడ్డి, ఎల్‌ ‌రమణ, ఉత్తమ్‌, ‌భట్టితో మాట్లాడానన్నారు. అంబేద్కర్‌ ‌విగ్రహం కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేస్తానన్నారు. ఈ నెల 17న రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించ నున్నట్టు వీహెచ్‌ ‌వెల్లడించారు.

Leave a Reply